మలయాళ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన నటులలో ఒకరు అయినటువంటి పృథ్వీరాజ్ సుకుమారన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు . ఈయన ఇప్పటికే ఎన్నో విజయవంతమైన సినిమాలలో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు . ఇక పోతే పోయిన సంవత్సరం విడుదల బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకున్న సలార్ సినిమాలో పృథ్వీరాజ్ ఓ కీలకమైన పాత్రలో నటించాడు. ప్రభాస్ హీరో గా రూపొంది న ఈ సినిమాకు ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించాడు.

ఈ సినిమాతో పృథ్వీరాజ్ కి తెలుగు లో మాత్రమే కాకుండా ఇండియా వ్యాప్తంగా అద్భుతమైన గుర్తింపు లభించింది . ఇలా సలార్ లాంటి సూపర్ సక్సెస్ ఫుల్ మూవీ తర్వాత ఈ నటుడు ది గోట్ లైఫ్ (ఆడు జీవితం) అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ కొన్ని రోజుల క్రితమే భారీ అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయింది. ఇప్పటి వరకు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 150 కోట్లకు పైగా కలెక్షన్ లను రాబట్టి అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రస్తుతం అద్భుతమైన కలక్షన్ లను వసూలు చేస్తూ ఫుల్ జోష్ లో దూసుకుపోతున్న ఈ సినిమా మరికొన్ని రోజుల్లో "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.

సినిమా యొక్క డిజిటల్ హక్కులను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సంస్థ వారు దక్కించుకున్నట్లు , అందులో భాగంగా మే 10 వ తేదీ నుండి ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇకపోతే ఆడు జీవితం సినిమాలో పృథ్వీరాజ్ తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను విమర్శకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ps