ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని కొంత కాలం క్రితం ఈస్మార్ట్ శంకర్ అనే మూవీ లో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీబ్లో నీది అగర్వాల్ , నబా నటేష్ హీరోయిన్లుగా నటించగా , డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ మూవీ కి దర్శకత్వం వహించాడు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఈ మూవీ సూపర్ సాలిడ్ విజయాన్ని అందుకుంది. ఇందులో రామ్ నటనకు గాను ప్రేక్షకుల నుండి, విమర్శకుల నుండి మంచి ప్రశంసలు లభించాయి.

మూవీ కంటే ముందు రామ్, పూరీ కి బాక్స్ ఆఫీస్ దగ్గర ఉన్నాయి. అలాంటి సమయంలో ఈ సినిమా వీరిద్దరికీ అద్భుతమైన కంబ్యాక్ ను ఇచ్చింది. ఇకపోతే రామ్మూవీ తర్వాత ది వారియర్ , స్కంద అనే రెండు సినిమాలలో హీరోగా నటించాడు. ఇవి రెండు కూడా ఈయనకు మంచి విజయాన్ని అందించలేదు. అలాగే ఈస్మార్ట్ శంకర్ మూవీ తర్వాత పూరి జగన్నాథ్ "లైగర్" మూవీకి దర్శకత్వం వహించాడు. ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇక ప్రస్తుతం వీరిద్దరి కాంబోలో ఈస్మార్ట్ శంకర్ మూవీ కి కొనసాగింపుగా డబల్ ఇస్మార్ట్ అనే మూవీ రూపొందుతుంది.

ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఫుల్ స్పీడ్ గా జరుగుతుంది. ఈ మూవీ ని తెలుగు , తమిళ , కన్నడ , కన్నడ , హిందీ భాషలలో విడుదల చేయనున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది. ఈ మూవీ కోసం రామ్ ఏ మాత్రం రెమ్యూనిరేషన్ తీసుకోవడం లేదు అని , సినిమా విడుదల అయిన తర్వాత లబలీ వచ్చినట్లు అయితే అందులో వాటా తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. సినిమా విడుదల తర్వాతే కానీ ముందు రామ్ ఈ సినిమాకు ఎలాంటి పారితోషకం తీసుకోవట్లేదు అని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: