మొదట మలయాళం లో పెద్దగా అంచనాలు లేకుండా చిన్న సినిమాగా విడుదల అయిన మంజుమ్మల్ బాయ్స్ మూవీ ప్రేక్షకుల నుండి అద్భుతమైన టాక్ ను తెచ్చుకొని భారీ కలెక్షన్ లను వసూలు చేయడం మాత్రమే కాకుండా ఇప్పటి వరకు ఏ మలయాళ సినిమా కూడా వసూలు చేయని రేంజ్ లో కలెక్షన్ లను వసూలు చేసి మలయాళ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఇలా ఈ మూవీ మలయాళం లో అద్భుతమైన విజయాన్ని అందుకొని ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తూ ఉండడంతో ఈ మూవీ ని ఆ తర్వాత తెలుగుక్లో కూడా విడుదల చేశారు.

మూవీ కి తెలుగు లో కూడా ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. దానితో ఇప్పటికే ఈ మూవీ టాలీవుడ్ ఇండస్ట్రీ లో కూడా అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లను వసూలు చేసింది. ఇకపోతే థియేటర్ ప్రేక్షకులను అల్లరించడంలో అద్భుతంగా సక్సెస్ అయిన ఈ సినిమా మరికొన్ని రోజుల్లోనే "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. ఈ సినిమా యొక్క డిజిటల్ హక్కులను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ "ఓ టి టి" సంస్థ దక్కించుకుంది. అందులో భాగంగా ఈ మూవీ ని మే 3 వ తేదీ నుండి "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది.

ఇకపోతే తాజాగా ఈ మూవీ "ఓ టి టి" డీల్ కి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ గా మారింది. ఈ సినిమాను డిస్నీ ప్లేస్ హాట్ స్టార్ "ఓ టి టి" సంస్థ వారు ఏకంగా 20 కోట్ల భారీ వ్యయంతో కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఇలా ఈ సినిమా థియేటర్ కలెక్షన్ లలోనే కాకుండా "ఓ టి టి" ద్వారా కూడా ఈ మూవీ బాగానే వసూలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Mb