బాలకృష్ణ ఫ్యాన్స్  ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న NBK109 సినిమా షూటింగ్‌ స్పీడ్‌ గా జరుగుతోంది. గత కొన్ని రోజుల నుంచి ఏపీలో అసెంబ్లీ మరియు పార్లమెంట్‌ ఎన్నికల కారణంగా బాలకృష్ణ షూటింగ్‌ కు దూరంగా ఉంటున్నాడు.ఈ సినిమాలో కీలక పాత్రలో  యానిమల్‌ ఫేం బాబీ డియోల్‌ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆయనకి సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. మొదటి సారి తెలుగు సినిమాలో నటిస్తున్న బాబీ డియోల్‌ చాలా ఎగ్జైట్‌ గా ఉన్నట్లుగా తాజా చిట్‌ చాట్‌ లో పేర్కొనడం జరిగింది.బాలీవుడ్ స్టార్ హీరోగా ఎన్నో సూపర్‌ హిట్స్ దక్కించుకున్న బాబీ డియోల్‌ ఇప్పుడు బాలయ్య, బాబీ సినిమాతో టాలీవుడ్‌ లో అడుగు పెట్టబోతున్నాడు. యానిమల్‌ మూవీలో బాబీ డియోల్‌ పాత్ర వైల్డ్‌ యానిమల్‌ ను తలపించింది. సౌత్‌ ప్రేక్షకుల అభిరుచికి తగ్గ విలన్ అంటూ యానిమల్‌ మూవీని చూస్తే అర్థం అవుతుంది. సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద 900 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ సినిమాలో హీరోగా చేసిన రనభీర్ కి ఎంత పేరు వచ్చిందో అంతే పేరు విలన్ గా చేసిన బాబీకి కూడా వచ్చింది.


ఇప్పుడు బాలయ్య సినిమాలో కూడా బాబీ క్యారెక్టర్ పవర్ ఫుల్ గా ఉంటుందని సమాచారం తెలుస్తుంది.బాలయ్య కు సరి పోటీ గా బాబీ డియోల్‌ నిలవడం ఖాయం అని సమాచారం తెలుస్తుంది. వీరిద్దరి కాంబో వెండి తెరపై ఖచ్చితంగా ఎన్నో మెరుపులు మెరిపిస్తుందనే విషయంలో ఎలాంటి డౌట్ లేదు. ఈ మూవీలో డబుల్‌ రోల్‌ లో బాలయ్య కనిపించబోతున్నాడని, ఒక హీరోయిన్ గా బాలీవుడ్‌ ముద్దుగుమ్మ ఊర్వశి రౌతేలా నటిస్తున్నట్లుగా కూడా సమాచారం తెలుస్తుంది. ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేయడం కోసం ప్లాన్ చేస్తున్నారు.అందుకే బాలీవుడ్‌ తారాగణం ను పెద్ద ఎత్తున ఈ సినిమాలో బాబీ నటింపజేస్తున్నాడని సమాచారం తెలుస్తుంది. ఖచ్చితంగా ఈ సినిమాతో బాలయ్య కూడా డబుల్‌ హ్యాట్రిక్ కొట్టడమే కాకుండా పాన్ ఇండియా హిట్ కొట్టడం కూడా ఖాయం అంటూ ఫ్యాన్స్ చాలా ధీమాతో ఉన్నారు. మరి చూడాలి ఈ సినిమా ఎలాంటి హిట్ ని నమోదు చేస్తుందో..

మరింత సమాచారం తెలుసుకోండి: