స్టార్ డైరెక్టర్ సుకుమార్ అల్లు అర్జున్ తో చేస్తున్న పుష్ప 2 సినిమాకు సంబంధించిన బిజినెస్ డీల్స్  చాలా వరకు క్లోజ్ అయ్యాయి.ఇక ఓవర్సీస్ లో కూడా పుష్ప 2 సినిమాకు ఏ స్థాయిలో క్రేజ్ ఉందొ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పుష్ప పార్ట్ 1 నష్టాల పాలు చేసినా కూడా పుష్ప 2 సినిమాకు నార్త్ అమెరికాలో కూడా మంచి డీల్ సెట్ అయినట్లుగా తెలుస్తోంది. బన్నీ కెరీర్ లోనే అత్యధిక స్థాయిలో బిజినెస్ చేస్తున్న సినిమాగా పుష్ప సెకండ్ పార్ట్ రికార్డులు క్రియేట్ చేస్తోంది.ఇక నార్త్ అమెరికాలో కూడా ఊహించని స్థాయిలో ఈ సినిమాకు మంచి డీల్ సెట్ అయినట్లు సమాచారం తెలుస్తుంది. ప్రత్యాంగిరా సినిమాస్ అనే డిస్ట్రిబ్యూషన్ సంస్థ పుష్ప 2 సినిమా నార్త్ అమెరికా రైట్స్ సొంతం చేసుకుంది. రీసెంట్ గా ఈ సంస్థ టిల్లు స్క్వేర్ సినిమా నార్త్ అమెరికా హక్కులను సొంతం చేసుకుని భారీ లాభాలు పొందింది. ఇక ఇప్పుడు అల్లు అర్జున్ బిగ్ బడ్జెట్ సినిమాను కూడా సొంతం చేసుకోవడంతో ఆ సంస్థ పేరు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిపోయింది.


నార్త్ అమెరికాలో పుష్ప ది రూల్ సినిమాను చాలా గ్రాండ్ గా విడుదల చేయాలని ఆ సంస్థ ప్రయత్నాలు చేయనున్నట్లు సమాచారం తెలుస్తుంది. ఇక పుష్ప సెకండ్ పార్ట్ కు సంబంధించిన మొదటి సాంగ్ కూడా అతి త్వరలోనే విడుదల కాబోతోంది. రీసెంట్ గా ఒక ప్రోమోని కూడా విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ ప్రోమోకి నెగటివ్ టాక్ వచ్చింది. కానీ పూర్తి పాట విడుదల అయితే గాని ఎలా ఉంటుందో చెప్పలేం. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇక సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా ఫాహాద్ ఫాసిల్ పవర్ ఫుల్ విలన్ గా కనిపించబోతున్నాడు.అలాగే సునీల్, ధనుంజయ, జబర్దస్త్ అనసూయ ఇలా ప్రముఖ నటీనటులు అందరూ కూడా సెకండ్ పార్ట్ లో మరింత డిఫరెంట్ గా కనిపించబోతున్నట్లు సమాచారం తెలుస్తుంది. ఇంకా అలాగే బాలీవుడ్ ప్రముఖ నటుడు సంజయ్ దత్ కూడా ఈ సినిమాలో ఒక స్పెషల్ క్యారెక్టర్ తో మెప్పించబొతున్నట్లు టాక్ వినిపించిన విషయం తెలిసిందే. మరి అది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: