టాలీవుడ్ నటుడు అల్లరి నరేష్ తాజాగా మళ్లీ అంకం దర్శకత్వంలో రూపొందిన ఆ ఒక్కటి అడక్కు అనే ఫుల్ లెన్త్ కామెడీ ఎంటర్టైనర్ మూవీలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీలో పొడుగు కాళ్ళ సుందరి ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ ని మే 3 వ తేదీన భారీ ఎత్తున థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ మూవీ నుండి చిత్ర బృందం టీజర్ , ట్రైలర్ మరియు కొన్ని పాటలను కూడా విడుదల చేసింది. వాటికి జనాల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. 

ఇప్పటి వరకు ఈ సినిమా నుండి చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు , పాటలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడం అలాగే చాలా సంవత్సరాల తర్వాత అల్లరి నరేష్ నటించిన ఫుల్ లెన్త్ కామెడీ ఎంటర్టైనర్ మూవీ కావడంతో ఆ ఒక్కటి అడక్కు సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇకపోతే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలను కూడా ఈ మూవీ బృందం పూర్తి చేసింది. ఈ మూవీకి సెన్సార్ బోర్డు నుండి యు / ఏ సర్టిఫికెట్ లభించింది. ఈ విషయాన్ని కూడా ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటించింది.

ఇకపోతే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన టికెట్ బుకింగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ చిత్ర బృందం తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టికెట్ బుకింగ్ లను ఓపెన్ చేశారు. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా తాజాగా విడుదల చేశారు. మరి ఈ మూవీ టికెట్ బుకింగ్ ప్రేక్షకుల నుండి ఎలాంటి రెస్పాన్స్ లభిస్తుందో చూడాలి. కొంత కాలం క్రితమే నరేష్ "నా సామి రంగ" అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. ఇందులో కీలక పాత్రలో నటించిన నరేష్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. మరి ఆ ఒక్కటి అడక్కు సినిమాతో ఏ స్థాయి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: