కోలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిష మెగాస్టార్ చిరంజీవితో కలిసి నటిస్తున్న చిత్రం 'విశ్వంభర'. పాన్ ఇండియా స్థాయిలో సుమారు రూ.200 కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమాకు బింబిసార' ఫేమ్ వశిష్ట దర్శకత్వం వహిస్తున్నాడు.కొన్ని నెలల క్రితమే ఈ మూవీ రెగ్యూలర్ షూటింగ్ స్టా్ర్ట్ అయ్యింది. ఇందులో చిరు జోడిగా త్రిష నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే షూటింగ్ సెట్ లో అడుగుపెట్టింది ఈ ముద్దుగుమ్మ. స్టాలిన్ వంటి సక్సెస్ ఫుల్ మూవీ తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తున్న ఇది. భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ మూవీపై ఇప్పటికే పాజిటివ్ బజ్ నెలకొంది. చాలా సంవత్సరాల తర్వాత చిరు నుంచి వస్తోన్న భారీ ఫాంటసీ థ్రిల్లర్ మూవీ కోసం ఈ కోసం అడియన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఈరోజు త్రిష బర్త్ డే కావడంతో ఈ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్.

త్రిషకు బర్త్ డే విషెస్ తెలుపుతూ విశ్వంభరలో ఆమె లుక్ రివీల్ చేశారు. ఇక తాజాగా విడుదలైన పోస్టర్ లో త్రిష లుక్ మాత్రం అద్భుతంగా ఉందనే చెప్పాలి. అందం మరింత అద్భుతంగా మారితే ఇలాగే ఉంటుందేమో అన్నట్లుగా కనిపిస్తుంది. రెడ్ లెహంగాలో మెడలో భారీ ఆభరణాలతో ఎంతో అందంగా కనిపిస్తుంది. ఈ లో త్రిష మరోసారి అందం, అభినయంతో కట్టిపడేయనున్నట్లు తెలుస్తోంది.ఇక తాజాగా రిలీజ్ అయిన పోస్టర్ లో బ్యాగ్రౌండ్ లో మార్క్, పంచభూతాల నక్షత్రం డిజైన్ తో చూసిన వెంటనే అబ్బురపరిచేలా కనిపిస్తుంది. ఈ లో త్రిష పాత్రి చాలా ప్రత్యేకంగ ఉంటుందని తెలుస్తోంది. ఇక త్రిష లేటేస్ట్ పోస్టర్ పై నెటిజన్స్ రియాక్ట్ అవుతున్నారు. ఇదే కాకుండా తమిళం, మలయాళంలోనూ పలు చిత్రాల్లో నటిస్తుంది.ఈ సినిమాలో ఆమె పాత్రకు ఎంతో ప్రాధాన్యత ఉంటుందని తెలుస్తోంది. ఎం. ఎం.కీరవాణి సంగీతం అందిస్తున్న 'విశ్వంభర' చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా ఛోటా కె. నాయుడు, ఎడిటర్ గా కోటగిరి వెంకటేశ్వరరావు వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా 2025, జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: