బాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ డైరెక్టర్ లలో ఒకరు అయినటువంటి సంజయ్ లీలా భన్సాలీ మొట్ట మొదటి సారి హిరామండి అనే వెబ్ సిరీస్ కు దర్శకత్వం వహించిన విషయం మనకు తెలిసిందే. ఈ వెబ్ సిరీస్ తోనే ఈయన డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ వెబ్ సిరీస్ లో ఎంతో గుర్తింపు కలిగిన నటీమణులు అయినటువంటి మనిషా కొయిరాలా , సోనాక్షి సిన్హా , అదితి రావు హైదరి ముఖ్య పాత్రలలో నటించారు. ఈ వెబ్ సిరీస్ ను సంజయ్ లీలా భన్సాలీ నెట్ ఫ్లిక్స్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ కోసం రూపొందించారు.

ఇకపోతే ఈ వెబ్ సిరీస్ మే 1 వ తేదీ నుండి చాలా భాషలలో నెట్ ఫ్లిక్స్ ఓ టి టి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ కు కేవలం మన దేశంలో మాత్రమే కాకుండా ఇతర దేశాల నుండి కూడా అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తుంది. దానితో ప్రస్తుతానికి ఈ వెబ్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ ఓ టి టి ప్లాట్ ఫామ్ లో ఇప్పటి వరకు ఇండియాలో అత్యధిక ఎక్కువ మంది వీక్షించిన వెబ్ సిరీస్ లలో ఒకటిగా నిలిచినట్లు తెలుస్తోంది. ఇక ఈ మూవీ 43 దేశాల్లో టాప్ 10 లో ట్రెండింగ్ లో కొనసాగుతుంది. ఇలా సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహించిన మొట్ట మొదటి వెబ్ సిరీస్ కు ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల నుండి అద్భుతమైన గుర్తింపు లభిస్తుంది.

ఇకపోతే ఈ మూవీ లో మనిషా కోయిరాలా , సోనాక్షి సిన్హా , అదితి రావు హైదరి వేశ్య పాత్రలో నటించారు. ఇందులో విరు తమ తమ నటనతో ప్రేక్షకులను మరియు విమర్శకులను అద్భుతమైన స్థాయిలో మెప్పించారు. ఇక ఈ మూవీ ని తెరకెక్కించిన విధానానికి గాను సంజయ్ లీలా భన్సాలీ కి కూడా ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు దక్కుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

slb