అంతటితో సుమ ఆగదు. కక్కుర్తితో స్వామి ప్రీ రిలీజ్ ఈవెంట్స్, సక్సెస్ సెలెబ్రేషన్ ఈవెంట్స్ కూడా అన్ని నాకే వచ్చేలా చూడు అని అడుగుతుంది. దీనితో ఆంజనేయ స్వామి.. నా చేతిలో ఏముంది అని అడుగుతారు.. గద అని చెబితే.. అది ఇచ్చుకు కొడతా అని వార్నింగ్ ఇస్తారు.ఇక లవ్ మీ చిత్ర యూనిట్ తో సుమ భలే సందడి చేసింది. దెయ్యాన్ని ప్రేమించడం మంచిదా, మనిషిని ప్రేమించడం మంచిదా అని సుమ ఆశిష్ రెడ్డిని అడుగుతుంది. దీనితో ఆశిష్ రెడ్డి దెయ్యమే బెటర్ అని అంటే.. అందుకేనా మా వారు నన్ను ప్రేమించారు అంటూ సుమ నవ్వులు పూయించింది.దెయ్యాలు ఎందుకు రాత్రిళ్ళు మాత్రమే తిరుగుతాయి అని సుమ అడుగుతుంది.. దీనికి వైష్ణవి సమాధానం ఇస్తూ సుమ పరువు తీసేలా సెటైర్ వేసింది. ఎందుకంటే దెయ్యాలు పగలు ఇలా షోలకు యాంకరింగ్ చేస్తూ బిజీగా ఉంటాయి అని సెటైర్ వేసింది. వైష్ణవి సెటైర్ కి సుమ కూడా ఆశ్చర్యపోయింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి