టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ గా కెరీర్ ను కొనసాగించిన వారిలో కాజల్ అగర్వాల్ ఒకరు . ఈమె లక్ష్మీ కళ్యాణం అనే మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయింది . ఈ మూవీ పెద్ద విజయం సాధించకపోయినప్పటికీ ఈమె ఆ తర్వాత చందమామ మూవీ తో మంచి విజయాన్ని అందుకుంది . ఇందులో ఈమె తన నటనతో , అంతకుమించిన అందాలతో ప్రేక్షకులను కట్టి పడేసింది. ఇక ఆ తర్వాత ఈ బ్యూటీ మగధీర అనే ఇండస్ట్రీ హిట్ సినిమాలో నటించింది. ఈ మూవీ తో ఈమె టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ స్థాయికి వెళ్లిపోయింది.

ఆ తర్వాత ఈమె వరస పెట్టి టాలీవుడ్ టాప్ హీరోల సరసన నటించడం , ఆమె నటించిన సినిమాలలో ఎక్కువ శాతం మూవీలు విజయాలు సాధించడంతో మళ్లీ సినిమా అవకాశాలు రావడం ఇలా చాలా సంవత్సరాల పాటు ఈమె తెలుగు లో స్టార్ హీరోయిన్ గా కెరియర్ ను కొనసాగించింది.  ప్రస్తుతం కూడా ఈమెకు మంచి అవకాశాలు తెలుగు లో లభిస్తున్నాయి. ఇలా తెలుగు సినీ పరిశ్రమ ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకున్న కాజల్ తెలుగు సాంప్రదాయాల గురించి తాజాగా చాలా ఇంట్రెస్టింగ్ విషయాలను చెప్పింది.

తాజాగా కాజల్ మాట్లాడుతూ ... తెలుగు రాష్ట్రాల్లో పుట్టకపోయిన తెలుగు సంస్కృతి , సాంప్రదాయాలు , భాష అంటే నాకు ఎంతో ఇష్టం. అందుకే తెలుగు సాంప్రదాయ పద్ధతి లోనే పెళ్లి చేసుకున్నట్లు తెలిపింది. మాకు సినిమాల్లో చాలా నకిలీ పెళ్లిళ్లు చేసేవారు. దాంతో నిజం పెళ్లి కూడా మన తెలుగు స్టైల్ లోనే చేసుకున్నాను. ముంబై లో పుట్టినప్పటికీ ఎంతో ఇష్టంగా తెలుగు నేర్చుకున్నాను. ఇప్పుడు నాకు ఇది సెకండ్ లాంగ్వేజ్ అని కాజల్ తాజాగా చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: