మోస్ట్ బ్యూటిఫుల్ యాంకర్ కం నటి అయినటువంటి అనసూయ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె కెరియర్ ప్రారంభంలో న్యూస్ రీడర్ గా పని చేసే ఆ తర్వాత జబర్దస్త్ కామెడీ షో కు యాంకర్ గా వ్యవహరించింది. ఈ కామెడీ షో సూపర్ సక్సెస్ కావడం , ఇందులో ఈమె తన యాంకరింగ్ తో డ్రెస్సింగ్ స్టైల్ తో ప్రేక్షకులను కట్టి పాడేయడంతో ఈమెకు సినిమాల్లో వరుసగా అవకాశాలు దక్కాయి. ఈమె సినిమాల్లో తన నటనతో , అంతకు మించిన అందాలతో ప్రేక్షకులను అలరిస్తూ రావడం అలాగే ఈమె నటించిన సినిమాలు కూడా చాలా వరకు సక్సెస్ కావడంతో అనసూయ కి సినిమాల్లో అవకాశాలు భారీగా పెరిగాయి. 

అందులో భాగంగా ఈమె కొంత కాలం క్రితం అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన హీరోయిన్ గా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన పుష్ప పార్ట్ 2 అనే సినిమాలో దాక్షాయిని అనే నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించింది. ఈ సినిమా పాన్ ఇండియా మూవీ గా విడుదల అయ్యి సూపర్ సక్సెస్ కావడంతో ఒక్క సారిగా అనసూయ క్రేజ్ దేశ వ్యాప్తంగా పెరిగిపోయింది. ఇకపోతే ప్రస్తుతం పుష్ప పార్ట్ 2 మూవీ చిత్రీకరణ జరుగుతుంది. నిన్న అనసూయ పుట్టిన రోజు కావడంతో పుష్ప పార్ట్ 2 మూవీ నుండి అనసూయ కు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను మేకర్స్ విడుదల చేశారు.

పోస్టర్ లో అనసూయ "పుష్ప" మొదటి భాగంలో ఏ విధమైన లుక్ లో ఉందో అదే లుక్ లో ఉంది. కాకపోతే ఈ సారి ఈమె మరింత ఎక్కువ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ పోస్టర్ తోనే ఈ సినిమాలో అనసూయ కు చాలా పెద్ద పాత్ర ఉండే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం అనసూయ కు సంబంధించిన ఈ పోస్టర్ సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: