1996లో శంకర్ అండ్ కమల్ హాసన్ కాంబినేషన్లో ఆడియన్స్ ముందుకు వచ్చిన సూపర్ హిట్ సినిమా భారతీయుడు. ఈ సినిమాకి 20ఏళ్ల తర్వాత మళ్లీ సీక్వెల్ ప్రకటించారు. అయితే ఈ సినిమా 2019లోనే షూటింగ్ మొదలుపెట్టారు. కానీ పలు కారణాల వల్ల షూటింగ్ ఆలస్యం అవుతూ వచ్చింది. ఈ సినిమా ఒక భాగంగా షూటింగ్ మొదలు పెట్టుకున్నా.. ఇప్పుడు రెండు భాగాలుగా రాబోతుంది. ఇటీవలే ఈ రెండు భాగాల సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటుంది. ఈ ప్రొడక్షన్ వర్క్ కూడా ఆలస్యం అవుతూనే

 ఉంది. మేకర్స్ ఈ సినిమాను జూన్ లో రిలీజ్ చేస్తామంటూ అనౌన్స్ చేశారు. అయినప్పటికీ కూడా ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇంకా పూర్తి కాకపోవడంతో ఈ సినిమా రిలీజ్ వాయిదా వేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా రిలీజ్ ను జూలై నెలలో పోస్ట్ పోన్ చేస్తారని ఫిల్మ్ సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది. జూలై 12న ఈ సినిమా రిలీజ్ చేయడానికి మేకర్స్ ఫిక్స్ అయ్యారట. ఈ సినిమా రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ కావడంతో ఈ సినిమాకు సంబంధించిన ఆడియో లాంచ్ ఈవెంట్ కూడా  వాయిదా వేస్తున్నట్లు తెలిసింది.

శంకర్మూవీ ఆడియో లాంచ్ ఈవెంట్ ను మే 16న గ్రాండ్ గా నిర్వహించేలా ప్లాన్ చేశారు. అంతేకాకుండా ఈ గ్రాండ్ ఈవెంట్ లో అతిథులుగా సూపర్ స్టార్ రజినీకాంత్ , మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ను ఇన్వైట్ చేశారట. అయితే ఈ ఆడియో లాంఛ్ ని జులై 1 న వాయిదా చేశారు. రజనీకాంత్, రామ్ చరణ్ ఆ సమయానికి సర్దుబాటు చేసుకుని ఈవెంట్ కి వస్తారా లేదా చూడాలి. మరోవైపు ఇండియన్ 2 సినిమాకి రాంచరణ్ మరొక సహాయం కూడా చేస్తున్నారట. శంకర్ ఇండియన్ 2 కి రామ్ చరణ్ తో వాయిస్ ఓవర్ చెప్పించాలని ప్లాన్ చేస్తున్నారట. సినిమాకి వాయిస్ ఓవర్ ఇవ్వాలని శంకర్ అడగడంతో రామ్ చరణ్ ఏం ఆలోచించకుండా వెంటనే ఓకే చెప్పేసారని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: