తేజ సజ్జ.. ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీలో కాస్త గట్టిగా వినిపిస్తున్న పేరు. ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ గా ప్రేక్షకులు అందరిని అలరించి  కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఒక రకంగా ఇంద్ర సినిమాలో చిన్నప్పటి మెగాస్టార్ పాత్రలో నటించి బుల్లి మెగాస్టార్ అనే ఒక టాగ్ ని కూడా సొంతం చేసుకున్నాడు. ఇక ఆ తర్వాత హీరోగా అవతారం ఎత్తి ఎన్నో వైవిధ్యమైన సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. గతంలో తేజ చేసిన జాంబిరెడ్డి మూవీ ఇక టాలీవుడ్ లోనే జాంబి అనే కాన్సెప్ట్ తో వచ్చిన తొలి తెలుగు మూవీ కావడం గమనార్హం. ఇక ఈ మూవీతో హిట్టు కొట్టిన తేజ.. వరుసగా డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ.. ప్రేక్షకుల ముందుకు వస్తూనే ఉన్నాడు.


 అయితే మొన్నటికి మొన్న అటు హనుమాన్ అనే సినిమాతో తేజ సజ్జ ఎంతటి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడో అందరూ చూశారు. ఇక అతనిపై అందరూ ప్రశంసలు కూడా కురిపించారు. ఈ క్రమంలోనే తేజ సజ్జా ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ పై కూడా ఎంతో అంచనాలు ఉన్నాయి. అయితే ఇక ఇప్పుడు ఈ యంగ హీరోకు సంబంధించి ఒక  క్రేజీ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఇప్పుడు వరకు ఇండస్ట్రీలో ఎంతోమంది సదాసీదా హీరోలను స్టార్ హీరోలుగా మార్చిన ఒక డైరెక్టర్ ఇప్పుడు తేజ సబ్జా తో మూవీ చేయబోతున్నాడట.


 ఆ డైరెక్టర్ ఎవరో కాదు పూరి జగన్నాథ్. చిరుత మూవీ తో చరణ్ ను, దేశముదురు, ఇద్దరమ్మాయిలతో లాంటి సినిమాలతో అల్లు అర్జున్ ను ఇలా అందరి హీరోలను స్టార్ హీరోలుగా మార్చేశాడు పూరి జగన్నాథ్. ఇక పోకిరి సినిమాతో అటు మహేష్ బాబుతో ఎంత పెద్ద హిట్ కొట్టాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలాంటి పూరీ జగన్నాథ్ ఇప్పుడు తేజ సజ్జతో ఒక సినిమా చేయబోతున్నాడట. ఇందుకు సంబంధించిన కథ చర్చలు జరుగుతున్నట్లు సినీ వర్గాల నుండి సమాచారం. పూరి జగన్నాథ్ ప్రస్తుతం హీరో రామ్ తో డబుల్ ఇస్మార్ట్ అనే సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇక ఈ మూవీ తర్వాత తేజతో చేసే సినిమాపై అధికారిక ప్రకటన రాబోతుంది అన్నది తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: