టాలీవుడ్ లో సీనియర్ హీరోయిన్గా కొనసాగుతున్న కాజల్ అగర్వాల్ గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే అప్పుడెప్పుడో లక్ష్మీ కళ్యాణం అనే సినిమాతో ఇండస్ట్రీకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన కాజల్ అగర్వాల్.. మొదటి సినిమాతోనే తన అందంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోగలిగింది. తేజ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ సూపర్ హిట్ అయింది. ఇక కాజల్ అగర్వాల్ మొదటి సినిమాతోనే గుర్తింపును సంపాదించుకుంది. ఆ తర్వాత తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో స్టార్ హీరోల సరసన నటించే ఛాన్స్ ను దక్కించుకుంది.


 దాదాపు ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలు అందరూ సరసన నటించింది. కేవలం యంగ్ స్టార్ హీరోలు మాత్రమే కాదు సీనియర్స్ తో కూడా జోడి కట్టి వారికి పర్ఫెక్ట్ జోడి అనిపించుకుంది. ఇక కొన్ని లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో కూడా నటించి తనలోని నటిని అందరికీ పరిచయం చేసింది. అయితే తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ కిచ్లుని పెళ్లి చేసుకుంది అన్న విషయం తెలిసిందే. ఇక పెళ్లి తర్వాత కాజల్ సినిమాలకు దూరం అవుతుంది అనే వార్తలు వచ్చినప్పటికీ.. పెళ్లయి బిడ్డ పుట్టిన తర్వాత కూడా ఇంకా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది అని చెప్పాలి. అయితే ఈ మధ్యకాలంలో సినీ సెలెబ్రేటీలందరూ కూడా తమ పర్సనల్ లైఫ్ గురించి అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే తన పెళ్లికి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్నీ కాజల్ అగర్వాల్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.  తెలుగు భాష తెలుగు సాంప్రదాయం అంటే తనకు ఎంతో ఇష్టం అంటూ తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లో పుట్టకపోయిన పెళ్లి కూడా అందుకే తెలుగు పద్ధతిలో చేసుకున్నట్లు తెలిపారు. నాకు మన సినిమాల్లో చాలా నకిలీ పెళ్లిళ్లు చేశారు. దీంతో నిజమైన పెళ్లిని కూడా సినిమా స్టైల్ లోనే తెలుగు పెళ్లిలా చేసుకున్నాను. ముంబైలో పుట్టిన తెలుగు ఇష్టంగా నేర్చుకున్నాను. తెలుగు నా సెకండ్ లాంగ్వేజ్ అంటూ చెప్పుకొచ్చింది కాజల్ అగర్వాల్.

మరింత సమాచారం తెలుసుకోండి: