తెలుగు సినీ పరిశ్రమలో నటిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో మెహరీన్ ఒకరు. ఈమె కృష్ణ గాడి వీర ప్రేమ గాధ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ మూవీ సూపర్ సక్సెస్ కావడం ఇందులో ఈమె తన నటనతో , అందాలతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో ఈ సినిమా తర్వాత ఈ బ్యూటీ కి తెలుగు లో వరుస సినిమా అవకాశాలు దక్కడం మొదలు అయింది. అందులో భాగంగా ఇప్పటికే అనేక సినిమాలలో నటించిన ఈమె టాలీవుడ్ ఇండస్ట్రీ లో తనకంటూ ఒక మంచి క్రేజ్ ను సంపాదించుకుంది.

ఇక ఈ మధ్య కాలంలో ఈమెకు వరుస అపజయాలు దక్కుతూ ఉండడంతో ఈ బ్యూటీ కి సినిమా అవకాశాలు కూడా చాలా వరకు ఈమెకు దక్కాయి. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో చిన్న చేతకా సినిమాలు తప్పితే భారీ క్రేజ్ ఉన్న మూవీ లు ఏమీ లేవు. ప్రస్తుతం ఈమె తెలుగు తో పాటు ఇతర భాష సినిమాల్లో కూడా నటించడానికి ఆసక్తిని చూపిస్తుంది. ఇకపోతే అప్పుడప్పుడు ఈమె కొన్ని ఆసక్తికరమైన పోస్టులను తన సోషల్ మీడియా అకౌంట్ లో చేస్తూ ఉంటుంది. అందులో భాగంగా కొన్ని రోజుల క్రితమే తల్లి కావడం కోసం తాను ఎగ్ ప్రీజింగ్ చేయించుకున్నట్లు ఓ పోస్ట్ పెట్టింది. ఇక ఈమె ఆ పోస్ట్ పెట్టడంతో దానిపై అనేక రకాల ప్రచారాలు మొదలు అయ్యాయి.

ఈమె ప్రెగ్నెంట్ అంటూ కూడా సోషల్ మీడియాలో ప్రచారం స్టార్ట్ అయింది. అలాగే ఈమె ఎక్స్ ప్రీజీంగ్ ప్రకటనపై కొన్ని తప్పుడు పోస్టులు కూడా కొంత మంది చేశారు. ఇక దీనిపై ఈమె తాజాగా స్పందిస్తూ .... తన ఎగ్ ప్రిజింగ్ ప్రకటనపై తప్పుడు పోస్టులు చేసిన వారు వాటిని వెంటనే తొలగించి తనకు బహిరంగ క్షమాపణ చెప్పాలి అని మెహరీన్ డిమాండ్ చేశారు. ఎగ్ ప్రిజింగ్ ఎక్స్ కోసం గర్భవతులు కానవసరం లేదు అని ఈమె మండిపడింది. ఇక ఎగ్ ప్రిజింగ్ అంటే వయసులో ఉన్నప్పుడు అండలను భద్రపరచుకొని తల్లి కావాలి అనుకున్నప్పుడు వాటి ద్వారా తల్లి అయ్యే పద్ధతిని ఎగ్ ప్రిజింగ్ అంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: