రామ్ పోతినేని హీరోగా నబా నటేష్ , నిధి అగర్వాల్ హీరోయిన్ లుగా డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో కొంత కాలం క్రితం ఈస్మార్ట్ శంకర్ అనే మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా సూపర్ సక్సెస్ ను అందుకొని రామ్ , పూరీ కి సూపర్ క్రేజ్ ను తీసుకువచ్చింది. నబా నటేష్ , నీది అగర్వాల్ కూడా ఈ మూవీ ల కంటే ముందు వరుస అభజాయలను ఎదుర్కొంటూ తెలుగు సినీ పరిశ్రమలో పెద్ద గుర్తింపును సంపాదించుకోలేదు.

సినిమా విజయంతో వీరి క్రేజ్ కూడా అమాంతం ఒక్క సారిగా పెరిగిపోయింది. ఇక ఈ మూవీ తర్వాత ఇటు రామ్ పోతినేని హీరో గా రూపొందిన ది వారియర్ , స్కంద మూవీ లు వరుసగా అపజాయలను అందుకున్నాయి. అలాగే పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన లైగర్ మూవీ కూడా ప్లాప్ అయ్యింది. దానితో విరు ఈస్మార్ట్ శంకర్ మూవీ కి కొనసాగింపుగా డబల్ ఈస్మార్ట్ అనే మూవీ ని రూపొందిస్తున్నారు. ఈ సినిమాని మరికొంత కాలంలోనే విడుదల చేయనున్నారు. తాజాగా మేకర్స్ ఈ సినిమా యొక్క టీజర్ ను విడుదల చేశారు.

సినిమా టీజర్ ను తెలుగు తో పాటు తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో కూడా విడుదల చేయగా వీటికి మంచి రెస్పాన్స్ జనాల నుండి లభించింది. ఇక ఈ మూవీ యొక్క టీజర్ కు 24 గంటల్లో మంచి రెస్పాన్స్ లభించింది. ఈ సినిమా టీజర్ 24 గంటల సమయంలో 7.04 మిలియన్ వ్యూస్ ను , 212.7 కే లైక్స్ లభించాయి. ఓవరాల్ గా చూసుకుంటే ఈ మూవీ టీజర్ కు ప్రేక్షకుల నుండి సూపర్ సాలిడ్ రెస్పాన్స్ లభించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: