టాలీవుడ్ తెలుగు సినీ ఇండస్ట్రీలో ఇప్పటికే చాలా మంది చైల్డ్ ఆర్టిస్టులుగా ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు స్టార్లుగా కొనసాగుతున్నారు. చాలామంది హీరో హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చి భారీ గుర్తింపును సంపాదించుకుంటున్నారు. అయితే ఇప్పటికే చాలా సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా తమ క్యూట్ నటనతో ఆకట్టుకున్న చాలామంది ఇప్పటికీ మంచి మంచి సినిమాల్లో నటించే అవకాశాలను దక్కించుకుంటున్నారు. వారిలో కావ్య కళ్యాణ్ రామ్ శ్రీవిద్య తేజ సర్జ వంటి స్టార్స్ చాలామంది ఉన్నారు. అయితే వీళ్ళందరూ టాలీవుడ్ లోనే సినిమాలు చేసి ఇప్పటికీ టాలీవుడ్ లోనే హీరో హీరోయిన్స్ గా కొనసాగుతున్నారు. కానీ ఒక అమ్మాయి మాత్రం ఒకప్పుడు టాలీవుడ్ ని ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసి ఇప్పుడు

 మాత్రం హాలీవుడ్ ఇండస్ట్రీని ఏలేస్తోంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. చాలా చిన్న వయసులోనే బాల్ నటిగా తన కెరీర్ను ప్రారంభించిన ఆమె ఇప్పుడు హాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. అంతేకాదు తాజాగా ఇప్పుడు ఒక ప్రముఖ హాలీవుడ్ మ్యాగజైన్ పై ఊహించని లుక్ లో కనిపించింది. మీరు పైన చూసిన ఫోటోలో అమ్మాయిని గుర్తుపట్టే ఉంటారు.. తెలుగులో పలు సినిమాలు చేసి యాడ్స్ కూడా చేసిందిఈమె హీరోయిన్ గా ప్రస్తుతం దూసుకుపోతోంది. ఆమె మరెవరో కాదు అవంతిక. సూపర్స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన బ్రహ్మోత్సవం సినిమాలో బాల నాటిగా అలరించింది ఈమె. ఆ తర్వాత తెలుగులో కూడా పలు సినిమాల్లో నటించి

 ఆకట్టుకుంది. ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన అజ్ఞాతవాసి సినిమాలో కూడా కనిపించింది. ఆ తర్వాత కొన్నాళ్లపాటు బుల్లితెరపై పలు యాడ్ చేసింది. ఆ తర్వాత హాలీవుడ్ కి వెళ్ళిపోయింది.స్పిన్ సినిమాతో హాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది ఈమె. కాగా ఇటీవల మీన్ గర్ల్ అనే సినిమాతో భారీ విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమాలో తన నటనతో హాలీవుడ్ మొత్తం తన వైపు చూసేలా అందరి చూపు తన వైపు తిప్పుకుంది. ఇదిలా ఉంటే.. తాజాగా హాలీవుడ్ మ్యాగజైన్ గలోరి కవర్ పేజీపై ఫోటోలకు ఫోజులిచ్చింది అవంతిక. హాలీవుడ్ లో రాణిస్తున్న బ్లాక్ బ్యూటీస్ ని హైలెట్ చేస్తుంటుంది ఈ మ్యాగజైన్. ఇక తాజాగా గలొరి మ్యాగజైన్ కవర్ పేజీపై పబ్లిష్ అయిన అవంతిక గ్లామర్ ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి. హెయిర్ కలర్ మార్చేసి.. పూర్తిగా హాలీవుడ్ అమ్మాయిల కనిపిస్తున్న అవంతికను చూసి షాకవుతున్నారు నెటిజన్స్.

మరింత సమాచారం తెలుసుకోండి: