జబర్దస్త్ కామెడీ షో ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో గెటప్ శీను ఒకరు. ఈయన జబర్దస్త్ కామెడీ షో లో ఎన్నో వెరైటీ గెటప్ లలో ప్రేక్షకులను నవ్వించడంతో ఈయనకు గెటప్ శీనుగా గుర్తింపు లభించింది. ఇప్పటికే ఈయన ఎన్నో సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో కొన్ని ముఖ్యమైన పాత్రలో నటించి ప్రేక్షకులను అలరించాడు. కానీ హీరోగా మాత్రం ఏ సినిమాలో నటించలేదు. మొట్ట మొదటి సారి గెటప్ శీను "రాజు యాదవ్" అనే సినిమాలో హీరో గా నటించాడు. 

కృష్ణమాచార్య దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను సాయి వరుణవి క్రియేషన్స్ , చరిష్మా డ్రీమ్స్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లపై కె. ప్రశాంత్ రెడ్డి , రాజేష్ కల్లెపల్లి సంయుక్తంగా నిర్మించారు. ఇక ఈ మూవీ ని కొన్ని రోజుల క్రితమే ఈ చిత్ర బృందం వారు మే 17 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇక ఈ సినిమా విడుదల తేదీ అతి దగ్గర పడిన నేపథ్యంలో ఈ మూవీ బృందం ఈ సినిమా యొక్క విడుదల తేదీని మార్చేసింది.

ఈ సినిమాను మే 24 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను విడుదల చేసింది. ఆ పోస్టర్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఇకపోతే ఈ సినిమా బృందం కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ ట్రైలర్ ను విడుదల చేసింది. ఆ ట్రైలర్ ప్రకారం క్రికెట్ ఆడుతుండగా శీను ఫేస్ కి గాయం అవుతుంది. ఆ గాయం కారణంగా ఇతను ఎప్పుడూ నవ్వుతున్న ఫేస్ లాగే కనబడుతూ ఉంటాడు.

ఒక ఆపరేషన్ చేయాలి అని డాక్టర్లు చెప్తారు. కానీ ఆపరేషన్ చేయడానికి వారి తల్లిదండ్రుల దగ్గర డబ్బు లేకపోవడం , శ్రీను మాత్రం కచ్చితంగా ఆపరేషన్ చేపించుకోవాలి అనుకోవడం ఇలాంటి పరిస్థితులతో ఈ సినిమా ట్రైలర్ సాగింది. ఈ మూవీ ట్రైలర్ బాగుండడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: