టాలెంటెడ్ నటుడు సత్యదేవ్ తాజాగా కృష్ణమ్మ అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ గా రూపొందిన ఈ సినిమా మే 10 వ తేదీన మంచి అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమాకు విడుదల అయిన మొదటి రోజు మిక్స్ డ్ టాక్ వచ్చింది. దానితో ఈ మూవీకి కొన్ని ఏరియాలో పెద్ద కలెక్షన్లు రావడం లేదు కానీ మాస్ కథంశంతో కూడిన సినిమాలను ఇష్టపడే జనాలను ఈ మూవీ బాగా ఆకట్టుకుంటూ ఉండటంతో ఈ మూవీ కి కొన్ని ఏరియాల నుండి డీసెంట్ కలెక్షన్ లు వస్తున్నాయి. 

ఇప్పటివరకు మంచి కలెక్షన్లు నమోదు అయినట్లు ఈ మూవీ యూనిట్ చెప్తూ వస్తుంది. ఇక తాజాగా ఈ సినిమా బృందం ఈ మూవీ కలెక్షన్ లకి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ ను విడుదల చేసింది. ఈ సినిమా ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా 5.40 గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసినట్లు అధికారికంగా ప్రకటిస్తూనే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ ను కూడా కంప్లీట్ చేసుకున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఇకపోతే ఈ మూవీ కి వి వి గోపాల కృష్ణ దర్శకత్వం వహించగా తెలుగు సినీ పరిశ్రమలో టాప్ డైరెక్టర్ లలో ఒకరిగా కెరీర్ ను కొనసాగిస్తున్న కొరటాల శివ ఈ సినిమాను సమర్పించాడు.

ఇక ఈ మూవీ కలెక్షన్ ల విషయం కాసేపు పక్కన పెడితే ఇప్పటికే అద్భుతమైన నటుడు అని పేరు తెచ్చుకున్న సత్యదేవ్ ఈ సినిమాలో కూడా తన సూపర్ నటనతో ప్రేక్షకులను , విమర్శకులను ఎంతగానో మెప్పిస్తున్నాడు. ఇలా ఇప్పటికే నటుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న ఈయన మరోసారి కృష్ణమ్మ మూవీ లో తనదైన నటనతో ప్రేక్షకులను మెప్పించడం , ఈ మూవీ ఇప్పటికే విజయాన్ని అందుకోవడంతో ఈయనకు మరిన్ని క్రేజీ మూవీలలో అవకాశాలు దక్కే ఛాన్స్ ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: