సాధారణంగా ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సంపాదించుకోవాలంటే ఇక డైరెక్టర్ గా చాలా సినిమాలు చేయాలి. ఇందులో చాలా హిట్స్ కూడా ఉండాలి. అలా అయితేనే డైరెక్టర్ నుంచి స్టార్ డైరెక్టర్గా ఎదుగుతారు. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే దర్శకుడు మాత్రం కాస్త సపరేట్. ఆయన చేసింది రెండే రెండు సినిమాలు. కానీ సంపాదించిన గుర్తింపు మాత్రం అంతా  ఇంత కాదు  శర్వానంద్ హీరోగా తెరకెక్కిన రన్ రాజా రన్ అనే సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు దర్శకుడిగా పరిచయం అయ్యాడు సుజిత్. ఇక ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ మూవీ ఎంత మంచి విజయాలు సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.


 అయితే రన్ రాజా రన్ సినిమా తర్వాత ఏ మూవీ చేయని సుజిత్ ఏకంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో సినిమా చేసే ఛాన్సును దక్కించుకున్నాడు. సాహో అనే టైటిల్ తొ సినిమా చేశాడు. యాక్షన్ అడ్వెంచర్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమా భారీ రేంజ్ లో అంచనాలను క్రియేట్ చేసింది. కానీ ఎందుకో థియేటర్లలో ప్రేక్షకులను మాత్రం మెప్పించలేకపోయింది. అయితే తెలుగు నాట అంతగా ఆదరణ పొందక పోయినప్పటికీ నార్త్ లో మాత్రం కలెక్షన్ల వర్షం కురిపించింది అని చెప్పాలి. ఇకపోతే ప్రస్తుతం సుజిత్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఓ జి ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అనే మూవీ చేస్తున్నాడు. ఇక ఇప్పటికే 70 శాతానికి పైగా చిత్రీకరణ కూడా పూర్తయింది.


 ఇక ఈ సినిమా పూర్తి అయిన వెంటనే నేచురల్ స్టార్ నానితో సుజిత్ ఒక మూవీ చేయనున్న సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమా గురించి ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. సరిపోద శనివారం అనే సినిమాతో బిజీగా ఉన్న నాని తదుపరి సినిమాను సుజిత్ డైరెక్షన్లో చేయాల్సి ఉంది. అయితే ఈ మూవీ ఆగిపోయిందట. నాని పుట్టినరోజు ఫిబ్రవరి 24న ఈ సినిమా అధికారిక ప్రకటన వచ్చింది. ఒక వైలలెంట్ మాన్ హింస అని వదిలేస్తే అతని జీవితం ఎలా తలకిందులైంది అంటూ ఆ సమయంలో విడుదల చేసిన ప్రకటనకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది.  ఇకఈ మూవీ లో నాని గ్యాంగ్స్టర్ గా కనిపించబోతున్నట్లు వార్తలు రావడంతో అంచనాలు పెరిగిపోయాయి. దీంతో ఈ మూవీ ఎలా ఉండబోతుందో అని అభిమానులు లెక్కలు వేసుకుంటున్న సమయంలో ఇక ఈ సినిమా ఆగిపోయినట్లు వార్తలు తెరమీదికి  వచ్చాయి. నిర్మాత డివివి దానయ్య ప్రాజెక్టును పక్కన పెట్టేసాడట.

మరింత సమాచారం తెలుసుకోండి: