ఇండియన్ బాక్సాఫీస్ వసూళ్లలో కొత్త చరిత్ర సృష్టించిన సినిమా బాహుబలి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, టాలీవుడ్ హల్క్ రానా, బొమ్మాలి అనుష్క, మిల్కీ బ్యూటి తమన్నా, వర్సటైల్ యాక్ట్రస్ రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన బాహుబలి ఫ్రాంఛైజీలో వచ్చిన రెండు సినిమాలు వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి.తాజాగా 'బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్' అనే టైటిల్‌తో ఈ కథలో కొత్త అధ్యాయం మొదలు అయింది. బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ యానిమేషన్ వెబ్ సిరీస్‌ను గ్రాఫిక్ ఇండియా, అర్క మీడియా బ్యానర్స్‌పై దర్శకుడు S.S. రాజమౌళి, శరద్ దేవరాజన్, శోభు యార్లగడ్డ నిర్మించారు. ఈ యానిమేటెడ్ వెబ్ సిరీస్‌కు జీవన్ జె. కాంగ్, నవీన్ జాన్ దర్శకత్వం వహించారు.ఇటీవల విడుదలైన బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ ట్రైలర్ ఎంతో ఇంట్రెస్టింగ్‌గా ఉంది. దీనికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులో కట్టు బానిస అయిన కట్టప్పే విలన్‌గా ఉండటం మరింత క్యూరియాసిటీ పెంచింది. ఎంతో క్రేజీ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ యానిమేటెడ్ వెబ్ సిరీస్ ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేసింది.ఎంతో బజ్ అండ్ ఎక్స్‌పెక్టేషన్స్‌ క్రియేట్ చేసిన బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ సిరీస్ మే 17వ తేదీ అంటే ఇవాళ్టి నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రముఖ ఓటీటీ డిస్నీ ఫ్లస్ ట్ స్టార్‌లో బాహుబలి క్రౌన్ ఆఫ్ బ్లడ్ డిజిటల్ ప్రీమియర్ అవుతుంది. అది కూడా ఏకంగా 8 భాషల్లో ప్రసారం అవుతోంది.

బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ యానిమేటెడ్ వెబ్ సిరీస్‌ను ప్రధానంగా హిందీలో తెరకెక్కించారు. అనంతరం తెలుగు, మలయాళం, తమిళం, బెంగాళి, కన్నడ, మరాఠిలో కూడా అనువదించారు. ప్రస్తుతం 8 భాషల్లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. అయితే అంతా బాగున్నప్పటికీ ప్రేక్షకులు నిరాశపరిచారు మేకర్స్ అండ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ నిర్వాహకులు.బాహుబలి ఫ్రాంఛైజీకి ప్రీక్వెల్‌గా వచ్చిన ఈ సిరీస్ నుంచి కేవలం రెండు ఎపిసోడ్స్ మాత్రమే విడుదల చేశారు. అనంతరం వారానికి ఒక ఎపిసోడ్ స్ట్రీమింగ్ చేస్తారని తెలుస్తోంది. అన్ని ఎపిసోడ్స్ ఒకేసారి స్ట్రీమింగ్ చేస్తే బాగుండేదని, కేవలం 2 ఎపిసోడ్స్‌తో క్యూరియాసిటీని తట్టుకోలేమని నెటిజన్స్, అభిమానులు, ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.ఇదిలా ఉంటే, ఈ యానిమేషన్ సిరీస్ నుంచి ఇదివరకే రెండు ఎపిసోడ్స్ స్క్రీనింగ్ చేశారు. అనంతరం జరిగిన ప్రెస్ మీట్‌లో మేకర్స్, ఓటీటీ హెడ్స్ అభిప్రాయాలు పంచుకున్నారు. "బాహుబలి యానిమేషన్ సిరీస్‌తో దర్శకుడు రాజమౌళి, నిర్మాత శోభు, గ్రాఫిక్ ఇండియాతో కలిసి పనిచేయడం హ్యాపీగా ఉంది. యానిమేషన్ సిరీస్‌లు అంటే పిల్లలకే అనే అభిప్రాయం ఉంది. అయితే మేము బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ యానిమేషన్ సిరీస్‌ను పెద్దల దగ్గరకు కూడా చేర్చాలని అనుకుంటున్నాం" అని డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ కంటెంట్ హెడ్ గౌరవ్ బెనర్జీ తెలిపారు.బాహుబలి వరల్డ్ పెద్దది అని, స్క్రీప్ట్ రాసేటప్పుడు ప్రతి పాత్రకు బ్యాక్ స్టోరీ, క్యారెక్టర్ ఆర్క్, తర్వాత కథను కూడా రాశామని రాజమౌళి పేర్కొన్నారు. ఆ కంటెంట్ అంతా ప్రేక్షకులకు చెప్పాలని ఉండేదన్నారు. మన దగ్గర సినిమా అంటే థియేటర్ రన్ ముగిశాక మరిచిపోతాం. కానీ, వెస్ట్రన్ సినిమాలో మూవీ అంటే ఒక బ్రాండ్ అని, బాహుబలిని కూడా యానిమేషన్ సిరీస్‌లు, కార్టూన్ బుక్స్, గేమింగ్‌తో బ్రాండ్ చేయాలని భావించినట్లు దర్శక దిగ్గజం వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: