యంగ్ రెబల్ స్టార్, బాహుబలి ఫేమ్ ప్రభాస్‌కు ప్రస్తుతం 44 ఏళ్ళు త్వరలోనే 45 వసంతంలో కూడా అడుగు పెట్టబోతున్నాడు అయినా ఇంతవరకు పెళ్లి చేసుకోలేదు. ఆయన పెళ్లి ఎప్పుడు అవుతుందా? ఫాన్స్ బాగా వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభాస్ ఒక సర్‌ప్రైజ్ ఇచ్చాడు. ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో "డార్లింగ్స్.. ఎట్టకేలకు ఒక ప్రత్యేకమైన వ్యక్తి మన జీవితంలోకి అడుగు పెట్టబోతున్నారు... వెయిట్ చేయండి." అని రాసుకొచ్చారు.

స్పెషల్ పర్సన్ అంటే ఇంకెవరై ఉంటారు, ప్రభాస్ కాబోయే భార్య అయి ఉంటుందని ఫాన్స్ ఊహాగానాలు చేసుకుంటున్నారు. ఇన్నాళ్లు వేచి ఉన్నా తాము ఇకపై వెయిట్ చేయాల్సిన అవసరం లేదని అనుకుంటున్నారు. వదినమ్మ వచ్చేస్తోంది అంటూ కామెంట్లు చేస్తున్నారు ఆమెని త్వరగా చూడాలని ఆత్రుత పడుతున్నారు. ఈ పోస్ట్ ప్రభాస్ వైఫ్ గురించి అయి ఉంటే ఈ హ్యాండ్సమ్ హీరోని కట్టుకునే ఆ లక్కీ గార్లు ఎవరా అనేదే ప్రస్తుతం పెద్ద ప్రశ్నగా మారింది. రాజుల వంశానికి చెందిన ప్రభాస్ ఇండస్ట్రీకి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడా లేదంటే తమ రాజుల వంశంలోనే ఎవరినైనా పెళ్లి చేసుకుంటాడా అనేది తెలియాల్సి ఉంది.

ఇకపోతే ప్రభాస్ ఇటీవల 'సలార్' సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు ఆ మూవీ తో ఫ్లాపుల పరంపరకు చెక్ పెట్టాడు. ఈ సినిమా మిగతా అన్ని సినిమాలను తొక్కేస్తూ భారత దేశమంతా కోట్లలో డబ్బులను కలెక్ట్ చేసింది. ఇప్పుడు ఈ ఆరడుగుల అందగాడు 'కల్కి 2898 AD', ' రాజా సాబ్ ', ' స్పిరిట్' సినిమాల్లో నటిస్తున్నాడు. మరి ప్రభాస్ పెట్టిన పోస్ట్ ఆయన కాబోయే భార్య గురించేనా లేదంటే ఇతర విషయాలకు సంబంధించిన అనేది తెలియాల్సి ఉంది. మూవీ అప్‌డేట్ అయినా సరే ఫ్యాన్స్ ఖుషి అవుతారు. ఇకపోతే రెండు రోజుల క్రితం ప్రభాస్ కో-స్టార్ అనుష్క శెట్టి కన్నడ నిర్మాతను పెళ్లి చేసుకోబోతుందని వార్తలు వచ్చాయి. అవి నిజమా కాదా అనేది తెలియ రాలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: