తమిళ స్టార్ హీరో విజయ్  వెంకట్ ప్రభు దర్శకత్వంలో 'గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. విజయ్ పొలిటికల్ ఎంట్రీ ముందు రూపొందుతున్న సినిమా కావడంతో అభిమానుల్లో అంచనాలు  రెట్టింపు అవుతున్నాయి.ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా జరుగుతున్నాయి. తాజాగా ఈ మూవీ గురించి ఇంట్రెస్టింగ్ విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. ఈ మూవీ విఎఫ్ ఎక్స్ కోసం ఏకంగా హాలీవుడ్ టెక్నిషన్లనే రంగంలోకి దింపుతున్నారు.'అవతార్'.. 'అవెంజెర్స్' లాంటి సినిమాలకు పనిచేసిన వీఎఫ్ ఎక్స్ బృందం ఈ సినిమా కోసం దిగుతుంది. ఈ విషయాన్ని క్రియేటివ్ ప్రొడ్యూసర్ అర్చనా కళ్పతి సోషల్ మీడియా ద్వారా తెలిపారు. 'సినిమా లో గ్రాఫిక్స్ కి ఎక్కువ ప్రాధన్యత ఉంటుంది. హీరో విజయ్ కోసం ప్రత్యేకంగా డీ-ఏజింగ్ టెక్నాలజీ వాడి పాతికేళ్ల కుర్రాడిగా చూపించాల్సి రావడంతో లాస్ ఏంజెల్స్ లోని స్టూడియో నిపుణులకు ఆ పనులని అప్పగించాం' అని అన్నారు. దీంతో సినిమాలో గ్రాఫిక్స్ కూడా ఎక్కువగానే ఉంటాయని సమాచారం తెలుస్తోంది.


ఇప్పటికే ప్రచార చిత్రాల్లో హీరో విజయ్ ద్విపాత్రాభినయం రివీల్ చేసిన సంగతి తెలిసిందే. అయితే అవి పెద్దగా ప్రేక్షకులకు కనెక్ట్ కాలేదు. వయసు మళ్లిన విజయ్...వయసులో ఉన్న విజయ్ ని చూపించే క్రమంలో యువ విజయ్ పాత్ర విషయంలో చాలా రకాల విమర్శలు వెల్లువెత్తాయి. ఆ పాత్రకి సంబంధించి గ్రాఫిక్స్ నాసిరకంగా ఉన్నాయనే విమర్శ కూడా  వచ్చింది. మరి తాజాగా హాలీవుడ్ టెక్నీషియన్లను రంగంలోకి దించిన నేపథ్యంలో ఆ పాత్రకు సంబంధించి మార్పులేమైనా చేస్తున్నారా? లేదా చూడాలి.ఇప్పటికే హాలీవుడ్ లో వాడుతున్న ఏఐ టెక్నాలజీని కూడా ఈ సినిమా కోసం వినియోగిస్తున్నట్లు సమాచారం గట్టిగా వినిపిస్తుంది. మొదట హీరో విజయ్ యంగ్ రోల్ కోసం అదే టెక్నాలజీ వాడినట్లు ప్రచారంలోకి వచ్చింది. మరి ఇందులో నిజమెంత ఉందో తెలియాల్సి ఉంది. ఈ మూవీకి తమిళ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ లలో ఒక్కడైన యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. ఇక అన్ని పనులు పూర్తి చేసి సెప్టెంబర్ 5 వ తేదీన ప్రేక్షకుల ముందుకు ఈ సినిమాని తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: