‘జయం’ మూవీ విడుదల తరువాత దర్శకుడు తేజా పై చాల అంచనాలు పెట్టుకున్నారు. ఆతరువాత ‘నిజం’ మూవీలో మహేష్ ను డిఫరెంట్ గా చూపించడానికి చేసిన ప్రయత్నం సక్సస్ కాకపోవడంతో పాటు ఆతరువాత అతడు తీసిన చాల సినిమాలు ఫెయిల్ అవ్వడంతో తేజ ప్రాభవం ఇండస్ట్రీలో అదేవిధంగా ప్రేక్షకులలో నెమ్మదిగా తగ్గుతూ వచ్చింది.ఆతరువాత చాలకాలానికి తేజా రానాతో తీసిన ‘నేనే రాజు నేనే మంత్రి’ హిట్ అవ్వడంతో తిరిగి ట్రాక్ లోకి వచ్చాడు అనుకున్నారు అంతా. అయితే ఆతరువాత అతడు తీసిన ‘సీత’ ఫ్లాప్ కావడంతో మళ్ళీ తేజ కష్టాలు మొదలయ్యాయి. ఆమధ్య రానా తమ్ముడు అభిరామ్ ను హీరోగా చేయాలని ఈ దర్శకుడు చేసిన ప్రయత్నాలు ఫెయిల్ అయిన విషయం తెలిసిందే.అయినప్పటికీ రానా తండ్రి సురేష్ బాబు తేజ పై ఉన్న నమ్మకంతో ‘రాక్షస రాజు’ మూవీ చేయబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈప్రకటన వచ్చి చాలనెలలు గడుస్తున్నప్పటికీ ఈమూవీ షూటింగ్ ప్రారంభం అవ్వకపోవడంతో అసలు ఈమూవీ మొదలవుతుందా లేదా అన్న సందేహాలు చాలమందికి వస్తున్నాయి. దీనికి కారణం తేజా కొన్ని సంవత్సరాల క్రితం వెంకటేష్ తో తీయాలనుకుని అతడికి చెప్పిన ‘ఆటా నాదే వేటా నాదే’ మూల కథ అన్న గాసిప్పులు వినిపిస్తున్నాయి.ఈ కథ అప్పట్లో వెంకటేష్ కు నచ్చినప్పటికీ కొన్ని కారణాల రీత్యా ఆమూవీ ప్రాజెక్ట్ ప్రారంభం కాలేదు. ఇప్పుడు అదే కథకు కొన్ని మార్పులు చేసి రానా తో తీయబోతున్న కథగా ‘రాక్షస రాజు’ మూవీ ప్రాజెక్ట్ మారింది అన్న గాసిప్పులు వస్తున్నాయి. ఈమూవీ ప్రారంభించకుండా రానా రజనీకాంత్ తో ‘వెట్టయన్’ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు’ దీనితో రానా తేజాల ‘రాక్షస రాజు’ ఉన్నట్ల లేనట్ల అంటూ ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనితో తేజ రానా గురించి ఇలాగే వేచి చూస్తూ ఉంటాడా లేదంటే ఇదే కథను వేరే హీరోతో తీస్తాడా అంటూ కొందరి కామెంట్స్..


మరింత సమాచారం తెలుసుకోండి: