ప్రముఖ నటి 'రష్మిక మందన్న'  ఇటీవల 'అటల్ సేతు' మీద ప్రయాణించారు. ప్రయాణ అనుభూతిని, దేశం యొక్క అభివృద్ధిని గురించి రష్మిక పేర్కొన్నారు.లోక్ సభ ఎన్నికల ఐదో దశ పోలింగ్ ముంగిట సినీ నటి రష్మిక మందన్నా సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్టు చేసిన సంగతి తెలిసిందే. ఏ పార్టీ పేరునూ ప్రస్తావించని ఆమె..అభివృద్ధికి ఓటేయండంటూ ఆమె తన ఫాలోవర్లకు పిలుపునిచ్చారు. భారత్‌లోనే అతిపెద్ది సీ లింక్ బ్రిడ్జ్‌గా గుర్తింపు పొందిన ముంబైలోని 'అటల్ సేతు'పై నుంచి మాట్లాడిన రష్మిక.. మీ కళ్లు తెరవండి అంటూ వీడియోలో మాట్లాడారు.
22 కిలోమీటర్ల పొడవున నిర్మించిన ఈ ఆరు లేన్ల వంతెన ప్రయాణ సమయాన్ని 2 గంటల నుంచి కేవలం నిమిషాలకు తగ్గిస్తుందని ఆమె చెప్పారు. భారత్ పెద్ద కలలు కలలేదన్నారు కానీ.. కేవలం ఏడేళ్లలోనే ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేశారన్నారు. అటల్ సేతుతో వికసిత భారత్‌కి ద్వారాలు తెరుచుకున్నాయన్న రష్మిక.. ఇది కేవలం బ్రిడ్జి కాదు మన యువ భారత్‌కు గ్యారంటీ అన్నారు.

ఇలాంటి వందలాది అటల్ సేతులు నిర్మించాలంటే.. మేల్కొని డెవలప్‌మెంట్‌కు ఓటేయాలని రష్మిక పిలుపునిచ్చారు. సౌతిండియా టు నార్త్ ఇండియా, వెస్ట్ ఇండియా టు ఈస్టిండియా.. కనెక్టింగ్ హార్ట్స్.. మై ఇండియా అంటూ ఆమె ఈ వీడియోను ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఏ పార్టీకి ఓటేయాలో చెప్పనప్పటికీ.. ఆమె ఎవరి కోసం ఈ వీడియో చేసిందో నెటిజన్లకు క్లియర్‌గానే అర్థమైంది.ఇప్పటికే అస్సామ్, అరుణాల్ ప్రదేశ్ వంటి దేశ భద్రతకు కీలమైన ప్రాంతాల్లో సెలా టన్నెల్స్ లాంటివి నిర్మించి అక్కడ ప్రజల జీవితాలతో పాటు దేశ భద్రతను పటిష్టపరిచే కార్యక్రమాలు చేపట్టిన సంగతి తెలిసిందే కదా. ఇలా దేశంలో చాలా ప్రాంతాల్లో కూడా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌తో ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించే పనిలో కేంద్ర ప్రభుత్వం నిమగ్నమైంది. తాజాగా ముంబైలో నిర్మించిన అటల్ సేతు ప్రాజెక్ట్ గురించి వివరస్తూ రష్మిక ఓ వీడియోను షేర్ చేసింది. న్యూ ఇండియా అంటూ నవీ ముంబై నుంచి పాత ముంబైకు రావాలంటే దాదాపు రెండు గంటలకు పైగా సమయం పడుతుంది. తాజాగా నిర్మించిన అటల్ సేతు ప్రాజెక్ట్‌తో అది 20 నిమిషాలకు కుదించబడింది. ఇలా దేశం అన్ని రంగాల్లో అగ్రగామిగా దూసుకుపోతున్న విషయాన్ని ప్రస్తావించింది.అటల్ సేతుపైన ప్రమాదాలను నివారించడానికి బైకులు, ఆటో రిక్షాలు వంటివి పూర్తిగా నిషిద్ధం.


అంతే కాకుండా ఈ వంతెన మీదుగా రోజుకి 70000 కంటే ఎక్కువ వాహనాల రాకపోకలు జరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. సముద్రం మీద నిర్మితమైన ఈ వంతెన వల్ల సముద్ర జీవులకు ఎటువంటి హాని కలగకుండా ఉండేందుకు అవసరమైన టెక్నాలజీ కూడా ఇందులో ఉపయోగించారు.ఇక ఈ పోస్ట్ పై ప్రధాని మోదీ స్పందించారు. ఆయన రిప్లై ఇస్తూ..."ఖచ్చితంగా! ప్రజలను కనెక్ట్ చేయడం మరియు జీవితాలను మెరుగుపరచడం కంటే సంతృప్తికరమైనది మరొకటి లేదు." అన్నారు.ఇక యానిమల్ హై సక్సెస్ తో ఇప్పుడు బాలీవుడ్ పెద్ద ప్రొడక్షన్ హౌస్ లు , దర్శకులు రష్మిక డేట్స్ కోసం వెంట పడుతున్నారు. ఐతే, రష్మిక బాలీవుడ్ లో ప్రస్తుతం ఒకే ఒక్క సినిమా కొత్తగా ఒప్పుకొంది. మిగతా ఆఫర్లను ఒప్పుకోలేదు. ముందుగా ఆమె తెలుగులో ఒప్పుకున్న చిత్రాలు పూర్తి చేసే ఆలోచనలో ఉంది. ఆ తర్వాత బాలీవుడ్ లో కొత్త చిత్రాలు సైన్ చేస్తుంది. ఒక్కసారిగా రష్మిక ఇప్పుడు ఫుల్ బిజీ అయిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: