తెలుగులో ఇప్పటివరకు భారీ లాభాలను అందుకున్న స్మాల్ మరియు మీడియం సినిమాలలో టాప్ 10 పొజిషన్ లో నిలిచిన మూవీ లు ఏవో తెలుసుకుందాం.

తేజ సజ్జ హీరోగా అమృత అయ్యర్ హీరోయిన్ గా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన హనుమాన్ సినిమా 127.95 కోట్ల లాభాలను అందుకొని స్మాల్ మూవీస్ లలో భారీ లాభాల అందుకున్న సినిమాల లిస్టు లో మొదటి స్థానం లో నిలిచింది. ఆ తర్వాత విజయ్ దేవరకొండ హీరో గా రూపొందిన గీత గోవిందం సినిమా 55.43 కోట్ల లాభాలను అందుకునే రెండవ స్థానం లోనూ , నిఖిల్ హీరోగా రూపొందిన కార్తికేయ 2 సినిమా 45.60 కోట్ల లాభాలను అందుకొని మూడవ స్థానంలో నిలిచింది. ఇక ఆ తర్వాత సిద్దు జొన్నలగడ్డ హీరో గా రూపొందిన టిల్లు స్క్వేర్ మూవీ 42 కోట్ల లాభాలను అందుకునే నాలుగవ స్థానంలోనూ , బేబీ మూవీ 37.25 కోట్ల లాభాలను అందుకొని ఐదవ స్థానంలో నిలిచింది. 

ఇక ఉప్పెన మూవీ 31.02 కోట్ల లాభాలను అందుకొని ఆరవ స్థానంలో నిలువగా , మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరో గా సాయి పల్లవి హీరోయిన్ గా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన ఫిదా సినిమా 30.5 కోట్ల కలెక్షన్ లను అందుకొని ఏడవ స్థానంలో నిలిచింది. దుల్కర్ సల్మాన్ హీరోగా మృనాల్ ఠాకూర్ హీరోయిన్ గా హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందిన సీత రామం సినిమా 30.30 కోట్ల లాభాలను అందుకొని ఎనిమిదవ స్థానంలో నిలవగా , సాయి ధరమ్ తేజ్ హీరోగా సంయుక్తా మీనన్ హీరోయిన్ గా రూపొందిన విరూపాక్ష సినిమా 26 కోట్ల లాభాలను అందుకొని 9 వ స్థానంలోనూ , జాతి రత్నాలు సినిమా 27.52 కోట్ల లాభాలను అందుకొని పదవ స్థానంలో నిలిచింది. ఇకపోతే ఈ అన్ని సినిమాలు కూడా మామూలు అంచనాల నడుమ విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సాలిడ్ లాభాలను అందుకున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: