అల్లుడు శీను మూవీ తో వెండి తెరకు పరిచయం అయిన యువ నటుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు . ఈయన అల్లుడు శీను మూవీ తో కమర్షియల్ విజయాన్ని అందుకొని తెలుగు లో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు . ఇక ఆ తర్వాత ఈయన పలు సినిమాలలో హీరోగా నటించినప్పటికీ వాటి ద్వారా ఈయనకు మంచి విజయాలు దక్కలేదు . అలాంటి సమయం లోనే ఈ నటుడు తమిళం లో బ్లాక్ బాస్టర్ విజయం అందుకున్న రాక్షసన్ మూవీ ని తెలుగు లో రీమేక్ చేశాడు.

మూవీ తెలుగు లో రాక్షసుడు అనే టైటిల్ తో విడుదల అయ్యి అద్భుతమైన విజయాన్ని అందుకుంది . ఈ మూవీ తో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కు కమర్షియల్ విజయం తో పాటు మంచి గుర్తింపు కూడా లభించింది. ఈ సినిమాలో తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన యువ నటి మనులలో ఒకరు అయినటువంటి అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలో వీరిద్దరి జంటకు కూడా మంచి క్రేజ్ వచ్చింది. ఇకపోతే మరోసారి వీరిద్దరి కాంబో లో మరో మూవీ రూపొందబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ప్రస్తుతం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా ఓ ప్రముఖ సంస్థ సినిమాను నిర్మించడానికి రెడీ అవుతుందట.

అందులో భాగంగా ఇప్పటికే దర్శకుడుని కూడా ఓకే చేసుకున్నారట. ఇక ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ ను హీరోయిన్ గా ఓకే చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ "బీమ్లా నాయక్" మూవీ దర్శకుడు అయినటువంటి సాగర కే చంద్ర దర్శకత్వంలో టైసన్ నాయుడు అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఫుల్ స్పీడ్ గా జరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: