ఎన్నో సినిమాలలో చైల్డ్ ఆర్టిస్టుగా నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో తేజ సజ్జ ఒకరు. చైల్డ్ ఆర్టిస్టుగా సూపర్ గుర్తింపును సంపాదించుకున్న ఈయన ప్రస్తుతం సినిమాల్లో హీరోగా నటిస్తూ వస్తున్నాడు. అందులో భాగంగా కొన్ని రోజుల క్రితమే ఈయన హనుమాన్ అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12 వ తేదీన విడుదల అయిన ఈ సినిమా అదిరిపోయే రేంజ్ బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ మూవీ ద్వారా తేజకు ఇండియా వ్యాప్తంగా అద్భుతమైన గుర్తింపు లభించింది. 

ఇక ప్రస్తుతం ఈ యువ నటుడు కొన్ని రోజుల క్రితమే మాస్ మహారాజా రవితేజ హీరో గా రూపొందిన ఈగల్ సినిమాకు దర్శకత్వం వహించిన కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందుతున్న మిరాయ్ అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఇక ఈ మూవీ లో టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన నటులలో ఒకరు అయినటువంటి మంచు మనోజ్ విలన్ పాత్రలో కనిపించబోతున్న విషయం మనకు తెలిసిందే. ఇకపోతే తాజాగా ఈ మూవీ మేకర్స్ ఈ సినిమాలోని మంచు మనోజ్ కు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.

మనోజ్ కు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను మే 20 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను విడుదల చేశారు. ప్రస్తుతం ఆ పోస్టర్ వైరల్ అవుతుంది. ఇక ఈ పోస్టర్ లో అన్ వీలింగ్ ది బ్లాక్ స్వోర్డ్ ఆన్ 20 . 5 . 24 అని రాసుకోచ్చారు. ఇకపోతే ఈ మూవీ లోని మనోజ్ ఫస్ట్ లుక్ పోస్టర్ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. మరి ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: