సినీ సెలబ్రిటీలకు సోషల్ మీడియాలో ఉండే క్రేజ్ దృశ్య వారికి సంబంధించిన ఏ విషయం తెరమీదకి వచ్చిన అది తెగ హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అలాంటిdi ఇక అందరికీ తెలిసిన స్టార్ హీరోలకు సంబంధించిన త్రో బ్యాక్ ఫోటోలు ఏవైనా ఇంటర్నెట్ లోకి వచ్చాయి అంటే చాలు అవి అభిమానులు అందరిని కూడా ఆకర్షిస్తూ ఉంటాయి. అయితే హీరో హీరోయిన్ల ఫోటోలు మాత్రమే కాదు వారి కుటుంబీకుల రేర్ ఫొటోస్ కూడా అప్పుడప్పుడు ఇంటర్నెట్ లోకి వస్తూ ఉంటాయి అని చెప్పాలి. ఇప్పుడు ఇలాంటి ఫోటోనే ఒకటి టాలీవుడ్ ప్రేక్షకులందరినీ కూడా తెగ ఆకట్టుకుంటుంది.


 ప్రస్తుతం ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ హీరోగా కొనసాగుతున్న ఒక హీరో తండ్రి ఫోటో ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ గా మారిపోయింది. ఈ ఫోటో చూస్తుంటే అచ్చం హీరోని చూస్తున్నట్లుగానే అనిపిస్తుంది అందరికీ. అయితే ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి అప్పట్లో నిర్మాతగా సత్తా చాటారు. ఇక ఈయన అన్నయ్య కూడా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా హవా నడిపించారు. ఇంతకీ ఆయన ఎవరో కాదు.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తండ్రి ఉప్పలపాటి సూర్యనారాయణ రాజు. ఆయనకు సంబంధించిన ఒక రేర్ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.


 ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా ఇండియా లోనే మోస్ట్ వాంటెడ్ హీరోగా కొనసాగుతున్న డార్లింగ్ ప్రభాస్ తండ్రి ఉప్పలపాటి సూర్యనారాయణ రాజు ఫోటో చూసి ఫ్యాన్స్ అందరు కూడా షాక్ అవుతున్నారు. ఎందుకంటే ఈ ఫోటోలో చూస్తుంటే అచ్చం బ్లాక్ అండ్ వైట్ ఫోటో దిగిన ప్రభాస్ లాగే కనిపిస్తున్నారు సూర్యనారాయణ రాజు. కాగా టాలీవుడ్ లో నిర్మాతకు అడుగుపెట్టిన ఆయన తన అన్నయ్య కృష్ణంరాజు నటించిన తొమ్మిది సినిమాలను నిర్మించారు. పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో జన్మించిన ఆయన లాంగ్ క్యాన్సర్ కారణంగా 61 ఏళ్ల వయసులో 2010లోని తుది శ్వాస విడిచారు. అభిమానులకు మాత్రం బాహుబలి లాంటి భారీ కటౌట్ అందించారు ఈయన.

మరింత సమాచారం తెలుసుకోండి: