తాజాగా సీరియల్ నటులు పవిత్ర జయరాం మరణం తర్వాత ఆమె ప్రేమికుడు నటుడు చందు తాజాగా సూసైడ్ చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే నటుడు చందు సంబంధించిన అనేక విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ముఖ్యంగా నటుడు చందు భార్య శిల్ప చెందుకు సంబంధించిన అనేక విషయాలను తెలియజేసింది. వారిద్దరికీ ఓ పాప, ఒక బాబు చిన్న వయసులో ఉన్న కానీ వారిని వదిలేసి గత ఐదు సంవత్సరాల నుండి పవిత్ర జయరాముతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నారంటూ తెలియజేసింది. ఇకపోతే తాజాగా నటుడు చందు తండ్రి కూడా ఆయనకు సంబంధించి ఆయన చెందిన అనేక విషయాలను తెలియజేశాడు. ఇక ఆ వివరాలను ఒకసారి చూస్తే..


సీరియల్ యాక్టర్ చందు తండ్రి వెంకటేష్ మాట్లాడుతూ.. పవిత్ర తో రిలేషన్ ఉన్నప్పటి నుంచి తల్లిదండ్రులు, బార్య పిల్లల్ని వదిలేశాడని., గత ఐదేళ్లుగా చందు మా ఇంటికి రాలేదని తెలిపాడు. అంతేకాదు మమ్మల్ని చూడలేదు. పవిత్ర చనిపోయిన తర్వాత డిప్రెషన్ లోకి వెళ్ళాడు. మూడురోజుల క్రితం మా ఇంటికి వచ్చాడు. పవిత్ర దగ్గరికి వెళ్లిపోతున్నా అని చెప్పాడు. అలా చేసుకోవద్దని చెప్పామని., అందరం కౌన్సిలింగ్ ఇచ్చాం అని తెలిపాడు. నిన్న పొద్దున లకడికపూల్ వెళ్లి వస్తా అని చెప్పి తిరిగిరాని లోకాలకి వెళ్ళిపోయాడు అంటూ వాపోయాడు.

మేమందరం కాల్స్ చేసినా లిఫ్ట్ చేయలేదని., మాకు తెల్సిన వ్యక్తిని చందు ఫ్లాట్ కి పంపించామని చెప్పారు. అక్కడ ఇంట్లో డోర్ పగలగొట్టి చూస్తే బాల్కనీ లో సూసైడ్ చేసుకొని బాడి వేలడుతూ ఉన్నట్లు తెలిపాడు. మేము వెళ్లేసరికి అక్కడికి పోలీసులు వచ్చారు. ఆ తర్వాత పోస్ట్ మార్టం కోసం బాడీని ఉస్మానియా మార్చురీకి తీసుకెళ్లారని ఆయన తెలిపారు.దీంతో నటుడు చందు సంబంధించిన అనేక విషయాలు ఒక్కొక్కటిగా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అనేక అనుమానాలు పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. ముందుగా నటుడు చందు సంబంధించిన వాట్సప్ చాటింగ్ వివరాలను పోలీసులు ఎంక్వయిరీ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: