తెలుగు సినీ పరిశ్రమలో నటుడుగా మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో ఒకరు అయినటువంటి శ్రీకాంత్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈయన తన కెరియర్ ప్రారంభంలో ఎన్నో సినిమాల్లో విలన్ పాత్రలో ముఖ్యపాత్రలో అలాగే చిన్న చిన్న పాత్రల్లో నటించి ఆ తర్వాత వరుసగా సినిమాల్లో హీరోగా అవకాశాలను దక్కించుకొని చాలా సంవత్సరాలు కెరీర్ను మంచి జోష్ లో ముందుకు సాగించాడు.

ఈ మధ్య కాలంలో శ్రీకాంత్ హీరో గా నటించిన సినిమాలు ఏవి కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను అందుకోవడం లేదు. దానితో ఈయన ఈ మధ్య వరుసగా సినిమాల్లో కీలక పాత్రలలో , విలన్ పాత్రలలో నటిస్తూ వస్తున్నాడు.  తాజాగా శ్రీకాంత్ "కోట బొమ్మాలి పి ఎస్" అనే సినిమాలో కీలకమైన పాత్రలో నటించాడు. ఈ మూవీ లో శివాని రాజశేఖర్ , రాహుల్ విజయ్ కీలక పాత్రలలో నటించగా ... వరలక్ష్మి శరత్ కుమార్ , మురళి శర్మమూవీ లో ఇతర పాత్రలలో నటించారు.

మంచి అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర డీసెంట్ విజయాన్ని అందుకుంది. ఇక ఆ తర్వాత ఈ మూవీ ఓ టీ టీ లోకి ఎంట్రీ ఇచ్చి డిజిటల్ ప్లాట్ ఫామ్ లో కూడా ప్రేక్షకులను బాగా అలరించింది. కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ వరల్డ్ ప్రసారం అయింది. ఇక ఈ మూవీ కి మొదటి సారి ప్రసారం అయినప్పుడు బుల్లి తెరపై 4.8 టిఆర్ పి రేటింగ్ దక్కింది. బాక్స్ ఆఫీస్ దగ్గర డీసెంట్ విజయాన్ని అందుకొని తర్వాత ఓ టీ టీ లో కూడా ప్రేక్షకులను డీసెంట్ గా అలరించిన ఈ మూవీ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా బుల్లి తెరపై ప్రసారం అయ్యి కూడా ప్రేక్షకులను బాగానే ఆదరించింది. ఈ మూవీ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా స్టార్ మా చానల్లో ప్రసారం అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: