కోలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ కలిగిన దర్శకులలో వేట్రీ మారన్ ఒకరు. ఈయన ఇప్పటి వరకు ఎన్నో అదిరిపోయే రేంజ్ బ్లాక్ బస్టర్ సినిమాలకు దర్శకత్వం వహించి తమిళ సినీ పరిశ్రమలో దర్శకుడిగా తనకంటూ ఒక అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ఈయన దర్శకత్వం వహించిన ఎన్నో సినిమాలు తెలుగు లో కూడా డబ్ అయ్యి విడుదల అయ్యాయి. అందులో కొన్ని సినిమాలు అద్భుతమైన విజయాలను టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా అందుకోవడంతో ఈ దర్శకుడి సినిమాలకు తెలుగు లో కూడా మంచి క్రేజ్ ఉంది.

ఇకపోతే కొంత కాలం క్రితం ఈయన కమీడియన్ సూరి , విజయ్ సేతుపతి ప్రధాన పాత్రల్లో విడుదల పార్ట్ 1 అనే మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ సినిమా తమిళ్ , తెలుగు భాషల్లో విడుదల అయ్యి అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ మూవీ మొదటి బాగం మంచి విజయం సాధించడంతో రెండవ భాగంపై ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు ఉన్నాయి. ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు ఉన్న నేపథ్యం లో ఈ సినిమా కథలో అనేక మార్పులు , చేర్పులు చేసినట్లు అలాగే బడ్జెట్ ను కూడా కొంచెం పెంచినట్లు ఆ కారణం తోనే ఈ సినిమా షూటింగ్ ఇంకా కూడా చిత్రీకరణ దశలోనే ఉంది అని తెలుస్తుంది.

మూవీ లో ఓ క్రేజీ నటుడు కూడా భాగం కాబోతున్నట్లు తెలుస్తోంది. అసలు విషయం లోకి వెళితే ... దర్శకుడిగా , నటుడిగా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న ఎస్ జే సూర్య ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు , ఈయన పాత్ర ఈ సినిమాకే హైలైట్ గా ఉండబోతున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. మరి నిజం గానే ఈ సినిమాలో సూర్య కనుక నటించినట్లు అయితే ఈ మూవీ పై అంచనాలు మరింత గా పెరిగే అవకాశం చాలా వరకు ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Vm