బ్యూటిఫుల్ అండ్ టాలెంటెడ్ నటి అంజలి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె తెలుగు అమ్మాయి అయినప్పటికీ కోలీవుడ్ ఇండస్ట్రీ సినిమాల ద్వారా గుర్తింపును సంపాదించుకుంది. ఈమె జర్నీ అనే మూవీ తో మొదటి విజయాన్ని అందుకుంది. మొదట తమిళ్ లో విడుదల అయ్యి సూపర్ సక్సెస్ అయిన ఈ సినిమాను ఆ తర్వాత తెలుగు లో కూడా విడుదల చేశారు. తెలుగు లో కూడా ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.

దానితో అంజలికి టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత ఈమెకు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీ తో తెలుగు స్టేట్ సినిమాతో విజయం దక్కింది. ఆ తర్వాత ఈమెకు బాలకృష్ణ , వెంకటేష్ వంటి సీనియర్ స్టార్ హీరోల సరసన హీరోయిన్ అవకాశాలు దక్కడం జరిగింది. కొన్ని సంవత్సరాల క్రితం ఈమె గీతాంజలి అనే సినిమాలో ప్రధాన పాత్రలో నటించింది. ఈ మూవీ మంచి విజయం అందుకుంది.

దాదాపు పది సంవత్సరాల తర్వాత గీతాంజలి మూవీ కి కొనసాగింపుగా గీతాంజలి మళ్లీ వచ్చింది అనే సినిమాను తెరకెక్కించారు. ఈ మూవీ విడుదల దగ్గర పడిన సందర్భంలో ఈమె వరస ఇంటర్వ్యూ లలో పాల్గొంది. అందులో భాగంగా ప్రస్తుతం నేను గీతాంజలి , గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి , గేమ్ చేంజర్ అనే మూడు సినిమాలలో నటిస్తున్నాను.

ఈ మూడు సినిమాలు కూడా దాదాపుగా ఇదే సంవత్సరంలో విడుదల కావడానికి రెడీగా ఉన్నాయి. అలాగే ఈ మూడు మూవీలు కూడా గా అనే అక్షరం తోనే మొదలు అవుతున్నాయి. ఈ మూడు సినిమాలతో కూడా నేను మంచి విజయాలను అందుకుంటాను అని చెప్పింది. కానీ ఈమె నటించిన ఈ మూడు సినిమాలలో మొదటి విడుదల అయిన గీతాంజలి మళ్లీ వచ్చింది సినిమానే బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. మరి రాబోయే రెండు సినిమాలతో అయినా ఈమె మంచి విజయాలను అందుకుంటుందో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: