జూనియర్ ఎన్టీఆర్ హీరోగా జాన్వి కపూర్ హీరోయిన్ గా కొరటాల శివ దర్శకత్వంలో దేవర అనే పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ రూపొందుతున్న విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో బాలీవుడ్ నటుడు అయినటువంటి సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో కనిపించనుండగా ... మోస్ట్ టాలెంటెడ్ సంగీత దర్శకుడు అనిరుద్ రవిచంద్రన్ ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ రెండు భాగాలుగా విడుదల కానుంది. ఈ సినిమా యొక్క మొదటి భాగాన్ని 2024 అక్టోబర్ 10 వ తేదీన విడుదల చేయనున్నారు. 

ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చి కూడా ఇప్పటికే చాలా కాలమే అవుతుంది. చాలా రోజుల నుండి ఈ మూవీ యొక్క మొదటి పాటను ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా మేకర్స్ విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు ఓ వార్త వైరల్ అవుతున్న విషయం మనకు తెలిసిందే. అందుకు అనుగుణం గానే మే 20 వ తేదీన ఎన్టీఆర్ పుట్టిన రోజు కాక అందుకు ఒక రోజు ముందుగా అనగా మే 19 వ తేదీనే దేవర మూవీ యొక్క మొదటి సాంగ్ ను విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

ఇక తాజాగా దేవర యూనిట్ ఈ మూవీ లోని మొదటి పాటను మే 19 వ తేదీన ఏ సమయానికి విడుదల చేయబోతున్నారు అనే విషయాన్ని కూడా క్లియర్ గా చెప్పుకొచ్చారు. తాజాగా మేకర్స్ ఈ సినిమా యొక్క ఫియర్ అంటూ సాగే మొదటి సాంగ్ ను మే 19 వ తేదీన రాత్రి 7 గంటల 02 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ఆ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇప్పటికే ఈ మూవీ ఆల్బమ్ అదిరిపోయే రేంజ్ లో ఉండబోతుంది అని ప్రొడ్యూసర్ నాగ వంశీ చెప్పడంతో ఈ మూవీ లోని మొదటి పాటపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. మరి ఈ సాంగ్ ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: