టాలీవుడ్‌లో స్టార్ కమెడీయన్‌గా పేరు తెచ్చుకున్న వారిలో సునీల్ ఒకడు. మొదటిలో సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్లు చేస్తూ.. కమెడీయన్‌గా గుర్తింపు తెచ్చుకుని తర్వాత హీరోగా కూడా పలు సినిమాలు తీశాడు.మూవీలో సునీల్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ శనివారం రివీల్ చేశారు.ఈ పోస్టర్‌లో సీరియస్‌ లుక్‌లో సునీల్ కనిపిస్తోన్నాడు. టర్బోలో సునీల్ ఆటో బిల్లా అనే క్యారెక్టర్‌లో కనిపించబోతున్నట్లు వెల్లడించారు. తెలుగులో చేసిన సినిమాలకు పూర్తి భిన్నంగా పవర్‌ఫుల్‌గా సునీల్ క్యారెక్టరైజేషన్ ఉంటుందని అంటున్నారు. మాలీవుడ్‌లో అతడికి మంచి పేరు తెచ్చిపెట్టే మూవీ అవుతుందని చెబుతోన్నారు.టర్బో మూవీ మే 23న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మమ్ముట్టి కెరీర్‌లో భారీ బడ్జెట్ మూవీలో ఒకటిగా టర్బో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమాను స్వయంగా మమ్ముట్టి ప్రొడ్యూస్ చేస్తున్నాడు. మమ్ముట్టి కంపెనీ బ్యానర్‌పై టర్బో మూవీని నిర్మిస్తున్నాడు. టర్బో మూవీలో కన్నడ దర్శకుడు, నటుడు రాజ్ బీ శెట్టి మెయిన్ విలన్‌గా నటిస్తోన్నాడు.యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ మూవీలో మమ్ముట్టి టర్బో జోస్ అనే జీప్ డ్రైవర్ పాత్రలోకనిపించబోతున్నారు. కేరళలోని ఇడుక్కికి చెందిన ఓ సాధారణ జీప్ డ్రైవర్‌కు చెన్నైకి చెందిన షణ్ముఖ సుందరం అనే బిజినెస్‌మెన్‌తో గొడవలు ఎలా మొదలయ్యాయి? పలుకుబడి, అధికారంలో తన కంటే ఎన్నో రెట్లు బలవంతముడైన షణ్ముఖ సుందరంతో టర్బో జోస్ ఎలా తలపడ్డాడు అన్నదే ఈ మూవీ

సెకండ్ ఇన్నింగ్స్‌లో తెలుగు కంటే తమిళంలోనే ఎక్కువగా బిజీ అయ్యాడు సునీల్‌. గత ఏడాది రజనీకాంత్ జైలర్‌లో సునీల్ ఓ కీలక పాత్ర చేశాడు ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఐదు వందల కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. . జైలర్‌తో పాటు అతడు నటించిన మార్క్ ఆంటోనీ, మావీరన్ సినిమాలు వంద కోట్ల వసూళ్లను దక్కించుకున్నాయి.తాజాగా టర్బోలో మలయాళంలోకి ఎంట్రీ ఇస్తోన్నాడు. ఈ ఏడాది ఐదు నెలల వ్యవధిలో సునీల్ నటించిన ఐదు సినిమాలు రిలీజయ్యాయి. వీటిలో గీతాంజలి మళ్లీ వచ్చింది సినిమాలో సునీల్ కామెడీ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్‌తో పుష్ప 2లో సునీల్ నెగెటివ్ షేడ్స్ క్యారెక్టర్స్ చేస్తున్నాడు. పుష్ప 2 మూవీ ఆగస్ట్ 15న రిలీజ్ అవుతోంది.మరోవైపు కొన్నాళ్లు మమ్ముట్టి బ్లాక్‌బస్టర్ సక్సెస్‌లతో దూసుకుపోతున్నాడు. కన్నూర్ స్క్వాడ్‌, కాథల్ ది కోర్‌, భ్రమయుగం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపించాయి. కాథల్ ది కోర్‌లో స్వలింగసంపర్కుడిగా, భ్రమయుగంలో నెగెటివ్ షేడ్స్‌తో కూడిన క్యారెక్టర్‌లో అసమాన నటనతో మమ్ముట్టి విమర్శకుల ప్రశంసల్ని అందుకున్నాడు. తెలుగులో ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకొచ్చిన యాత్ర 2లో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పాత్రలో మమ్ముట్టి కనిపించాడు. ప్రస్తుతం మరో నాలుగు మలయాళం సినిమాల్లో హీరోగా నటిస్తోన్నాడు మమ్ముట్టి.

మరింత సమాచారం తెలుసుకోండి: