తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా కెరియర్ ను కొనసాగిస్తున్న రష్మిక మందన గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె ఛలో అనే మూవీతో తెలుగు తెరకు పరిచయం అయ్యి మొదటి మూవీతోనే టాలీవుడ్ లో విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత రష్మిక కి "గీత గోవిందం" సినిమాలో అవకాశం దక్కడం , ఈ మూవీ కూడా బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో ఈమెకు ఆ తర్వాత వరుసగా టాలీవుడ్ స్టార్ హీరోల సరసన సినిమా అవకాశాలు దక్కాయి.

దానితో ఈమె టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ప్రస్తుతం కూడా ఈ బ్యూటీ టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కెరియర్ ను కొనసాగిస్తుంది. ఇకపోతే ఈ బ్యూటీ తన కెరియర్ లో కొన్ని సినిమాలను కూడా వదులుకుంది. అలా ఈ బ్యూటీ వదులుకున్న సినిమాలలో అంటే సుందరానికి మూవీ ఒకటి. ఈ మూవీ లో నాని హీరోగా నటించగా ... నజ్రియా హీరోయిన్ గా నటించింది.

వివేకా ఆత్రేయమూవీ కి దర్శకత్వం వహించాడు. ఇక ఈ మూవీ కథ మొత్తం రెడీ అయిన తర్వాత ఈ సినిమాలో నాని కి జోడిగా రష్మిక హీరోయిన్ అయితే బాగుంటుంది అని ఉద్దేశంతో యూనిట్ ఈమెను సంప్రదించిందట. కథ మొత్తం విన్న ఈమె ప్రస్తుతం ఇతర సినిమాలతో బిజీగా ఉన్నాను , ఈ మూవీ చేయడం ప్రస్తుతం కుదరదు అని చెప్పిందట.

దానితో వీరు నజ్రియా ను సంప్రదించడం , ఆమె ఈ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిందంట. అలా మొదట రష్మిక ను అంటే సుందరానికి మూవీ లో హీరోయిన్ గా అనుకోగా ఆమె రిజెక్ట్ చేయడంతో ఆ ప్లేస్ లో నజ్రియా వచ్చింది. ఇకపోతే ఈ మూవీ యావరేజ్ విజయాన్ని అందుకున్నప్పటికీ ఈ సినిమా ద్వారా నజ్రియాకు మంచి గుర్తింపు టాలీవుడ్ ఇండస్ట్రీలో దక్కింది. గతంలో నాగార్జున , నాని ప్రధాన పాత్రలో దేవదాసు అనే సినిమా రూపొందిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో నాని కి జోడిగా రష్మిక నటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: