ఒకప్పుడు ఒక భాష నటుడు మరో భాషలో నటించడం చాలా తక్కువగా చూసే వాళ్ళం. ఇక ఉన్న దాంట్లోనే నటీనటులను వెతుక్కునేవారు దర్శకుడు నిర్మతలు. కానీ ఇప్పుడు ఇలాంటి ట్రెండ్ ఎప్పుడు కనుమరుగయింది. ఏకంగా ఇతర భాషల నటులు తెలుగులో నటించడానికి తెగ ఆసక్తిని కనబరుస్తున్నారు. ఈ మధ్యకాలంలో తెలుగు సినిమాలు దేశవ్యాప్తంగా కూడా సూపర్ హిట్ సాదిస్తున్నాయి.


 ప్రపంచ వేదికలపై కూడా సత్తా చాటుతూ ఉన్నాయి. దీంతో ఇక టాలీవుడ్ దర్శకులు ఆపరిస్తే పెద్ద పెద్ద స్టార్లు సైతం అస్సలు వద్దనడం లేదు. ఈ క్రమంలోనే ఈ మధ్యకాలంలో బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి మాత్రమే కాదు కోలీవుడ్ నుంచి కూడా పెద్ద స్టార్స్ అటు తెలుగు సినిమాల్లో నటిస్తూ ఉండడం చూస్తూ ఉన్నాం. అయితే ఇక ఇప్పుడు మహేష్ బాబు కెరియర్ లో 29వ సినిమాగా తెరకెక్కుతున్న మూవీలో మహేష్ ను ఢీకొట్టే విలన్ పాత్రలో ప్రభాస్ ఫ్రెండ్ నటించబోతున్నాడుట. ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన సలార్ మూవీ సూపర్ హిట్ అయింది.


 ఈ మూవీ లో ప్రభాస్ క్లోజ్ ఫ్రెండ్ అయినా వరద రాజమన్నార్ పాత్రలో నటించాడు మలయాళ నటుడు పృథ్విరాజ్ సుకుమారన్. ఇక తన నటనతో ఆకట్టుకున్నాడు. ఇక ఇప్పుడు ఇతను మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న సినిమా లో ఛాన్స్ దక్కించుకున్నాడట. ఏకంగా విలన్ పాత్ర పోషించ బోతున్నాడట. ఇక ఇందుకు సంబంధించిన వార్త ఇండస్ట్రీ లో చక్కర్లు కొడుతుంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అయితే రాజమౌళి దర్శకత్వం లో ఈ సినిమా తెరకెక్కుతుంది అన్న విషయం తెలిసిందే. రాజమౌళి మూవీ కావడంతో ఇక పృథ్వీరాజ్ సినిమా ఆఫర్ వస్తే తిరస్కరించే ఛాన్సే లేదుఅని చెప్పాలి.ఇక రాజమౌళి సినిమాలో విలన్ పాత్రలు ఎంత పవర్ఫుల్ గా ఉంటాయో అందరికీ తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: