డాన్స్ కొరియోగ్రాఫర్ గా , నటుడిగా , దర్శకుడిగా తమిళ , తెలుగు పరిశ్రమలలో అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న వారిలో రాఘవ లారెన్స్ ఒకరు. ఈయన తన అద్భుతమైన డ్యాన్స్ లతో ప్రేక్షకులను ఆకట్టుకోవడం మాత్రమే కాకుండా ఎన్నో సినిమాల్లో నటించి నటుడిగా కూడా గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక ఆ తర్వాత కొన్ని సినిమాలకు దర్శకత్వం వహించి వాటిలో కొన్నింటితో మంచి విజయాలను అందుకొని దర్శకుడిగా కూడా తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు.

ఈ మధ్య కాలంలో మాత్రం లారెన్స్ ఎక్కువ శాతం సినిమా పాటలకు కొరియోగ్రఫీ చేయడం , దర్శకత్వం వహించడం కంటే కూడా సినిమాల్లో నటించడానికి ఎక్కువ ఆసక్తిని చూపిస్తున్నాడు. అందులో భాగంగా వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. కొన్ని రోజుల క్రితమే ఈయన కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో రూపొందిన జిగర్ దండ డబల్ ఎక్స్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

మూవీ యావరేజ్ విజయం అందుకున్న ఇందులో లారెన్స్ తన నటనతో ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలను అందుకున్నాడు. ఇకపోతే ఈయన ఓ తెలుగు డైరెక్టర్ తో మూవీ చేయడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తుంది. తెలుగు లో మంచి గుర్తింపు కలిగిన దర్శకులలో శ్రీ వాసు ఒకరు. ఈయన గోపీచంద్ హీరోగా రూపొందిన లక్ష్యం , రామబాణం సినిమాలకు దర్శకత్వం వహించాడు.

అలాగే బాలకృష్ణ హీరోగా రూపొందిన డిక్టేటర్ మూవీ కి కూడా దర్శకత్వం వహించాడు. ఈయన లారెన్స్ తో మూవీ చేయడానికి కొన్ని రోజుల క్రితమే ఓ కథను ఆయనకు వినిపించినట్లు , ఆయన కూడా దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు , ప్రస్తుతం ఆ కథకు సంబంధించిన ఫైనల్ పనులు జరుగుతున్నట్లు , అన్ని ఓకే అయితే ఈ క్రేజీ కాంబోలో ఓ మూవీ రాబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: