బాలీవుడ్ లో అత్యంత క్రేజ్ కలిగిన సిరీస్ మూవీలలో హౌస్ ఫుల్ సిరీస్ మూవీ లు కూడా మంచి స్థానంలో ఉంటాయి. ఈ సిరీస్ నుండి ఇప్పటికే 4 మూవీ లు రాగా అందులో 4 కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. దానితో ఈ సిరీస్ నుండి 5 వ మూవీ ఎప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఇకపోతే ఇప్పటికే మేకర్స్ ఈ సినిమా 5 వ భాగం కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకున్నారు. మరికొన్ని రోజుల్లోనే ఈ మూవీ యొక్క రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతోంది. ఈ మూవీ లో అక్షయ్ కుమార్ హీరో గా కనిపించనుండగా ... కత్రినా కైఫ్ హీరోయిన్ గా కనిపించబోతుంది.

సాజిద్ నడియాద్వాలా ఈ మూవీ ని నిర్మిస్తున్నాడు. మరికొన్ని రోజుల్లోనే ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ కానుండగా ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం ఈ చిత్ర యూనిట్ అనిల్ కపూర్ ను ఎంచుకుందట. ఈ సినిమా కథ మొత్తం విని మొదట ఈ మూవీ లో నటించడానికి అనిక్ కపూర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. కానీ ఆ తర్వాత ఈయన ఆశించిన రెమ్యూనిరేషన్ ఇవ్వడంలో మూవీ యూనిట్ అంతా ఆసక్తి చూపించకపోవడంతో అది నచ్చని అనిల్ కపూర్మూవీ నుండి తప్పుకున్నట్లు తెలుస్తోంది.

ఇక అనిల్ కపూర్ తప్పుకోవడంతో మరో నటుడిని వెతికే పనిలో పడ్డ మూవీ యూనిట్ ఈ సినిమాలో అనిల్ కపూర్ చేయవలసిన పాత్రలో అర్జున్ రాంపాల్ ను తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇలా రెమ్యూనిరేషన్ కారణంగా హౌస్ ఫుల్ 5 సినిమా నుండి అనిల్ కపూర్ తప్పుకున్నట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వార్త తెగ వైరల్ అవుతుంది. ఇకపోతే అర్జున్ రాంపాల్ , బాలకృష్ణ హీరోగా రూపొందిన భగవంత్ కేసరి సినిమాలో విలన్ పాత్రలో నటించాడు. ఈ మూవీ ద్వారా ఈయనకు తెలుగు లో కూడా మంచి గుర్తింపు లభించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: