యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అందులో మొదటి భాగాన్ని అక్టోబర్ 10వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈరోజు ఈ సినిమాలోని ఫియర్ అంటూ సాగే మొదటి సాంగ్ ను విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఈ సాంగ్ కి సంబంధించిన ప్రోమో ను మేకర్స్ విడుదల చేయగా దానికి అద్భుతమైన రెస్పాన్స్ జనాల నుండి లభించింది. 

అలాగే ఈ సాంగ్ విడుదల అయ్యాక హుకుం సాంగును మరిచిపోతారు ఆ రేంజ్ లో ఈ సాంగ్ ఉండబోతుంది అని ప్రముఖ నిర్మాత సూర్య దేవర నాగ వంశీ చెప్పడంతో ఈ సాంగ్ పై ప్రేక్షకుల్లో అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. ఇకపోతే ఈ మూవీ లోని ఫియర్ అంటూ సాగే మొదటి సాంగును ఈ రోజు రాత్రి 7 గంటల 02 నిమిషాలకు విడుదల చేయనున్నారు. తాజాగా ఈ చిత్ర బృందం వారు ఈ మూవీలోని మొదటి పాటను తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల చేయనున్నట్లు ప్రకటిస్తూనే ఏ భాషలో ఎవరు ఈ పాటకి లిరిక్స్ రాశారు అనే విషయాన్ని కూడా అధికారికంగా ప్రకటించారు.

మరి ఈ సినిమాలోని మొదటి సాంగ్ కి ఏ భాషలో ఎవరు లిరిక్స్ రాశారు అనే విషయాలను తెలుసుకుందాం. ఈ పాట యొక్క తెలుగు వర్షన్ కి లిరిక్స్ ను రామజోగయ్య శాస్త్రి రాయగా , తమిళ్ వర్షన్ కి విష్ణు ఎడవన్ లిరిక్స్ అందించారు. హిందీ వర్షన్ కు మనోజ్ ముంటాషిర్ లిరిక్స్ అందించగా , మలయాళ వెర్షన్ కి మంకొంబు గోపాల కృష్ణన్ లిరిక్స్ అందించారు. కన్నడ వర్షన్ కి వరద రాజ్ చిక్కబల్లపుర లిరిక్స్ అందించారు. ఇక ఈ సాంగ్ ప్రేక్షకులను ఏ స్థాయిలో అలరిస్తుందో చూడాలి. ఈ సినిమాలో ఎన్టీఆర్ కి జోడిగా జాన్వీ కపూర్ నటిస్తూ ఉండగా ... సైఫ్ అలీ ఖాన్మూవీ లో విలన్ పాత్రలో కనిపించనున్నాడు. కొరటాల శివ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: