బుల్లితెర నెంబర్ వన్ కామెడీ షో గా కొనసాగుతున్న జబర్దస్త్ ఎందరికో జీవితాన్ని ఇచ్చింది అని చెప్పొచ్చు. ఇక ఇందులో కమెడియన్స్ గా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత సినిమాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చారు చాలామంది. ఇక అలాంటి వారిలో గెటప్ శ్రీను కూడా ఒకరు. ఇక గెటప్ శ్రీను గురించి తెలుగు ఆడియన్స్ కి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. జబర్దస్త్ లో ఇప్పటికే ఎన్నో అద్భుతమైన గెటప్స్ వేసి టెలివిజన్ కమల్ హాసన్ అనే పేరుని కూడా సంపాదించుకున్నాడు. తాజాగా ఎప్పుడూ మరొక బిరుదుని కూడా అందుకున్నాడు. అది కూడా మెగాస్టార్

 చిరంజీవి నోటి నుండి ఆ విరుదుని అందుకున్నాడు. ఇన్నాళ్లు కమెడియన్ గా పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు నటించిన గెటప్ శ్రీను ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. రాజు యాదవ్ అనే సినిమాతో హీరోగా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇకపోతే ఈ సినిమా మే 24న విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. ప్రస్తుతం సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు చిత్ర బృందం. అయితే గెటప్ శ్రీనుకి మెగాస్టార్ చిరంజీవి అంటే అంతులేని అభిమానం అన్న సంగతి చాలా మందికి తెలిసే ఉంటుంది. అలానే

 మెగాస్టార్ చిరంజీవి సైతం శ్రీను ని ఎంతో ఇష్టపడతారు. ఇందులో భాగంగానే ఇప్పుడు తన సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ ని చేసేందుకు ముందడుగు వేశారు మెగాస్టార్. అయితే వచ్చే వారం సినిమా విడుదల కాబోతుండడంతో సినిమాని కచ్చితంగా చూడాలి అంటూ ప్రేక్షకులకు విజ్ఞప్తి చేస్తూ ఒక వీడియోని విడుదల చేశారు. ఇక అందులో భాగంగానే చిరంజీవి గెటప్ శ్రీను గురించి మాట్లాడుతూ.. 'గెటప్ శ్రీనుని చూస్తుంటే నాకు ఒకప్పటి కామెడీ హీరో గుర్తుకు వస్తారు. ఆయన పేరు 'చలం'. అప్పటిలో ఆయన్ని ఆంధ్రా దిలీప్ కుమార్ అని పిలిచేవారు. ఇప్పుడు గెటప్ శ్రీను నటన చూస్తుంటే నాకు వారే గుర్తుకు వస్తారు' అంటూ చెప్పుకొచ్చారు. ఇక మొన్నటి వరకు టెలివిజన్ కమల్ హాసన్ అనిపించుకున్న గెటప్ శ్రీను.. నేడు చిరంజీవి పలికిన ఈ మాటలతో 'ఆంధ్రా దిలీప్ కుమార్', 'జూనియర్ చలం' అని కూడా పిలిపించుకుంటారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: