సినీ ఇండస్ట్రీలో హీరోగా పలు సినిమాలలో నటించి అనంతరం కమెడియన్ గా పలు సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి వారిలో సీనియర్ నటుడు నరేష్ ఒకరు.ప్రస్తుతం ఈయన పలు సినిమాలలో తండ్రి పాత్రలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇక పోతే నరేష్ వ్యక్తిగత విషయానికి వస్తే ఇప్పటివరకు మూడు పెళ్లిళ్లు చేసుకున్నారు. అయితే తన ముగ్గురు భార్యలకు విడాకులు ఇచ్చారు. నటి పవిత్ర లోకేష్ తో రిలేషన్ లో ఉన్నటువంటి ఈయన తనతో కలిసి కొత్త జీవితం ప్రారంభించారు.ప్రేమ ..ఎప్పుడూ ..ఎవరికీ.. ఎలా అయినా పుట్టొచ్చు ..రీజన్స్ లేవు .. దానికి ఏజ్ లిమిట్ కూడా లేదు.. ప్రేమ గుడ్డిది ..బ్లైండ్.. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ..ఇలా ఎన్నెన్నో నీతులు చెప్తూ ఉంటారు ప్రేమికులు.ఆ ఎంజాయ్ నెస్ ప్రేమలో పడిన వాళ్లకు మాత్రమే తెలుస్తుందేమో . కాగా రీసెంట్ గా సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో నరేష్ పేరు ఏ రేంజ్ లో మారుమ్రోగిపోయిందో మనకి తెలిసిందే . మరీ ముఖ్యంగా సినిమాలపరంగా ఎలా ఉన్నా కానీ ఆయన పర్సనల్ లైఫ్ పరంగా మాత్రం సోషల్ మీడియాలో నిరంతరం ట్రోల్ అవుతూనే ఉంటాడు .

 కన్నడ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పవిత్ర లోకేష్ తో ప్రేమాయణం గురించి ఆయన ఏ విధంగా సోషల్ మీడియాలో హ్యూజ్ ట్రోలింగ్ ఎదుర్కొన్నారో మనకు బాగా తెలిసిందే. అయితే ఎవరు ఏమనుకున్నా వుయ్ డోంట్ కేర్ నా పని నాది అంటూ తనదైన స్టైల్ లో ముందుకు వెళ్ళాడు నరేష్. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నరేష్ తన ఫ్యామిలీ సీక్రెట్స్ మొత్తంగా బయట పెట్టేశారు . నరేష్ కి మహేష్ బాబుకి మధ్య ఉన్న బాండింగ్ గురించి అలాగే మహేష్ బాబు ఫేవరెట్ ఫుడ్ గురించి ఓపెన్ గా చెప్పేసాడు .'అంతేకాదు పవిత్ర లోకేష్ ది తన అమ్మగారు విజయనిర్మలది పుట్టినరోజు ఒకేరోజు అని .. ప్రకృతి మమ్మల్ని అలా కలిపింది అని .. దేవుడు అలా సిగ్నల్ ఇచ్చాడు అని చెప్పుకొచ్చారు.. అంతేకాదు పవిత్ర చాలా చాలా మంచిది అని .. మా అమ్మలాగే స్ట్రాంగ్ ఉమెన్ అని చెప్పుకు వచ్చిన నరేష్.. మా అమ్మ చివరి రోజుల్లో నా గురించి బాధ పడిపోతున్న మూమెంట్లో నేనే ఆమెకు చెప్పాను అని .. నా గురించి బాధపడకు నా లైఫ్ లోకి ఒక మంచి వ్యక్తి వచ్చింది అని చెప్పుకొచ్చాడట '. ప్రజెంట్ నరేష్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: