తమిళంలో డిఫరెంట్ సినిమాలు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు విక్రమ్. ఇప్పటివరకు ఈ హీరో చేసిన సినిమాలన్నీ కూడా మంచి విజయాన్ని అందుకున్నాయి. అయితే ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలన్నీ కూడా విడుదలై మంచి విజయాన్ని అందుకున్నాయి. కానీ ఇప్పటివరకు ఆయన చేసిన ఒక సినిమా కూడా విడుదల కాకుండా ఉండిపోలేదు. ఈ నేపథ్యంలోనే గత నాలుగు ఐదు సంవత్సరాల కిందట షూటింగ్ పూర్తయిన ధ్రువ నక్షత్రం సినిమా మాత్రం ఇప్పటివరకు విడుదల కావడం లేదు. దానికి కారణం ఏంటో తెలియదు కానీ

 ఎప్పటి నుండో రిలీజ్ డేట్లను అనౌన్స్ చేస్తున్నప్పటికీ ఒక్క రిలీజ్ డేట్ కి కూడా విడుదల చేయలేదు. ఈ సినిమానే కాదు ఇటీవల ఆయన తంగలాన్ సినిమా కూడా పూర్తి చేశారు. పా రంజిత్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సైతం ఎప్పుడో విడుదల కావాలి. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఇప్పటికి డిలే అవుతూ వస్తోంది. అయితే ఇన్నేళ్ల నుండి ఎప్పుడూ ఆయన సినిమాలకి రాని అడ్డంకి ఈ సినిమాలకే ఎందుకు ఎదురవుతుంది అని అభిమానులు తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఒకప్పుడు ఆయన నటించిన

 శివపుత్రుడు అపరిచితుడు నాన్న ఐ వంటి సినిమాలన్నీ కూడా భారీ విజయాన్ని అందుకున్నాయి. ఇక ఈ సినిమా లతో నే ఆయనకి స్టార్డం వచ్చింది అని చెప్పొచ్చు. కేవలం తమిళంలోనే కాకుండా తెలుగులో కూడా ఆయన సినిమాలు చేయడంతో తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా దగ్గరయ్యారు. మరి ఎందుకు ఆయన నటించిన ఈ రెండు సినిమాల విడుదల లేట్ అవుతూ వస్తుంది అన్నదానిపై క్లారిటీ రావాలి అంటే దీనిపై అధికారిక ప్రకటన వచ్చినంత వరకు మరికొద్ది రోజులు ఆగాల్సిందే. ఇది ఇలా ఉంటే ఈ రెండు సినిమాలు విడుదల కాకముందే మరికొన్ని సినిమాలను లైన్ లో పెట్టాడు విక్రమ్. ఈ సినిమాలు విడుదల అవ్వకపోయినా పర్లేదు తగ్గేదేలే అని ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: