జబర్దస్త్ కామెడీ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యింది పవిత్ర. ఇక ఈ షో తో తనదైన కామెడీ టైమింగ్ తో అందరినీ ఆకట్టుకుంటూ ఉంటుంది. చాలా తక్కువ సమయంలోనే జబర్దస్త్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు చాలా దగ్గరయిపోయింది. అలా జబర్దస్త్ షో తో పాటు యూట్యూబ్లో సొంతంగా ఒక ఛానల్ కూడా రన్ చేస్తోంది. అలాగే పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో కనిపిస్తూ అలరిస్తూ ఉంటుంది. ఇక  ఏడాది క్రితం ఒక కారు కొన్నది పవిత్ర. అప్పట్లో కారు కొన్న విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోని కూడా షేర్

 చేసింది. అయితే తాజాగా ఇప్పుడు అదే కారు ప్రమాదానికి గురైంది. ఇక ఈ విషయాన్ని పవిత్ర స్వయంగా తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఒక వీడియో షేర్ చేయడం జరిగింది. అయితే ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఓటు వేయడానికి తన పిన్ని పిల్లలతో పాటు తన సొంత ఊరికి వెళ్ళింది. అలా వెళ్తున్న క్రమంలో నెల్లూరు ఉప్పాలపాడు హైవేపై వాళ్ళ కారుకి మరొక కారు ఎదురు వచ్చి వారి కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పవిత్ర కు చిన్నచిన్న గాయాలు అయ్యాయి. అలాగే ఆమె కుటుంబ సభ్యులకి సైతం చిన్న చిన్న గాయాలతో బయటపడ్డారు.

 కాగా ఈ విషయాన్ని పవిత్ర తన సోషల్ మీడియా వేదికగా ఒక వీడియో షేర్ చేయడంతో ఆ వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఆ వీడియోలో భాగంగా పవిత్ర మాట్లాడుతూ .. ఎన్నికలకు ఊరు వెళ్తుండగా.. తనకు యాక్సిడెంట్ జరిగిందని.. తను , తన పిన్ని, పిల్లలందరూ ప్రాణాలతో బయటపడ్డామని తెలిపింది. ఆ ఘటన తలుచుకుంటేనే భయమేస్తుందని చెప్పుకొచ్చింది. ఎంతో కష్టపడి కొనుక్కున్న కారు ఇప్పుడు పూర్తిగా నాశనమైందని.. ప్రాణాలతో ఉంటామని అసలు అనుకోలేదని.. కానీ ఇప్పుడు అందరం సేఫ్ గానే ఉన్నామంటూ చెప్పుకొచ్చింది. ఇకపోతే ఈ సంఘటన కంటే ముందు పవిత్ర జయరాం చంద్రకాంత్ ఇద్దరు కారు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. అయితే ఇందులో బుల్లితెరపై సీరియల్స్ ద్వారా అలరించిన పవిత్ర అక్కడికక్కడే మృతి చెందగా.. నటుడు చంద్రకాంత్ సైతం ఆ విషయాన్ని జీర్ణించుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: