భారీ బ్యాక్ గ్రౌండ్ ఉండి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి రెండు దశాబ్దాలు అవుతున్న ఇప్పటికీ అగ్ర హీరోగా కొనసాగుతూ ఉన్నారు జూనియర్ ఎన్టీఆర్.. శ్రమ, పట్టుదల, ప్రతిభతో విలక్షణమైన నటుడుగా పేరు సంపాదించారు జూనియర్ ఎన్టీఆర్. ఈ రోజున జూనియర్ ఎన్టీఆర్ 41వ పుట్టినరోజు సందర్భంగా ఎన్టీఆర్ గురించి కొన్ని విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ తాత నందమూ తారక రామారావు రూపమే కాదు ఆయనలోని నటన కూడా ఉనికి పుచ్చుకున్నారు జూనియర్ ఎన్టీఆర్.సినిమాలకు ఎలా కావాలో అలా తయారవుతూ నటుడుగా ఎన్టీఆర్ నెక్స్ట్ లెవల్లో ఉన్నారని చెప్పవచ్చు.. జూనియర్ ఎన్టీఆర్ ఏదైనా డైలాగ్ ఒక్కసారి చూస్తే చాలు సిను పూర్తి అయ్యేవరకు  మళ్లీ పేపర్ చూడరట. డాన్స్ విషయంలో కూడా జూనియర్ ఎన్టీఆర్ కు సాటిరారని ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీలు కూడా తెలియజేశారు. జూనియర్ ఎన్టీఆర్ రిహార్సల్ అవసరం లేకుండానే సింగిల్ టేక్ లో ఫినిష్ చేయగలిగిన సామర్థ్యం కలదు. నవరసాలు అలవోకగా పండించగలిగిన నటుడుగా పేరు సంపాదించారు ఎన్టీఆర్ .ఎన్టీఆర్ ఎలాంటి పాత్రలోనైనా సరే ఇమిడిపోయి మరి నటిస్తూ ఉంటారు.

జయపజయాలకు బెదరకుండా సక్సెస్ బాట పట్టారు జూనియర్ ఎన్టీఆర్. జూనియర్ ఎన్టీఆర్ కెరియర్లో.. ఆది, సింహాద్రి వంటి సినిమాలు భారీ విజయాన్ని అందుకున్నాయి.. ఆ తర్వాత ఎన్నో సినిమాలు అపజయాలా చుట్టుముట్టాయి. కానీ ఏమాత్రం వెనకడుగు వేయకుండా దూసుకుపోయారు జూనియర్ ఎన్టీఆర్. జూనియర్ ఎన్టీఆర్ ఎక్కడ మాట్లాడినా కూడా చాలా స్పష్టతతోనే మాట్లాడుతూ ఉంటారు. ఇండస్ట్రీలో కూడా అందరి హీరోలతో మంచి స్నేహబంధం కలిగి ఉన్న నటుడుగా పేరుపొందారు జూనియర్ ఎన్టీఆర్. జూనియర్ ఎన్టీఆర్ కు ఎంత స్టార్డం ఉన్నప్పటికీ తను వచ్చిన చోటును మాత్రం ఎప్పుడు మర్చిపోరు. rrr చిత్రంతో తెలుగు సినీ పరిశ్రమకు ఆస్కార్ కలని సాధ్యం చేయడంలో కూడా భాగమయ్యారు.ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమాలో నటిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: