ప్రస్తుతం ప్రముఖ నటి అనే బిరుదుదో కొనసాగుతోన్న అనసూయ నిత్యం వివాదాస్పదంగా వ్యాఖ్యలు చేస్తూ వివాదాలతోనే సావాసం చేస్తుంటుంది. విజయ్ దేవరకొండ పేరు వినపడితే విరుచుకుపడిపోతుంది. అతని విమర్శిస్తూ పరోక్షంగా ఎన్నో పోస్టులు షేర్ చేసింది. విజయ్ అభిమానులు కూడా అదేరీతిలో అనసూయను ట్రోల్ చేశారు. అయినా వెనక్కి తగ్గేది లేదని తేల్చిచెబుతుంది.తాజాగా అనసూయ యానిమల్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగామీద విరుచుకుపడింది. యానిమల్ సినిమాలోని రెండు సన్నివేశాలను షేర్ చేసింది. మీది హిపోక్రసీ అయితే.. నన్ను కపటధారి అంటారా? అని ప్రశ్నిస్తూ ఒక వీడియోను షేర్ చేసింది. యానిమల్ సినిమాలో హీరో రణబీర్ కపూర్ తన తండ్రి అనిల్ కపూర్ మీద అటాక్ ప్రణాళిక రూపొందించిన సొంత బావను చంపేస్తాడు. బావను తానే చంపేశానని అక్కడకు చెబుతాడు. స్ట్రాంగ్ అండ్ యంగ్ ఉమన్ నువ్వు అని, ఇంకో పెళ్లి చేసుకోవాలని, నీకోసం అబ్బాయిని తానే వెతుకుతానని చెబుతాడు.
ఇదే రణబీర్ కపూర్ తన భార్య రష్మికకు మాత్రం భిన్నమైన సలహా ఇస్తాడు. విలన్ తో యుద్ధానికి వెళుతూ తాను తిరిగివస్తానో రానో తెలియదని, ఒకవేళ రాకపోతే ఇంకో పెళ్లి మాత్రం చేసుకోవద్దని రష్మికకు చెబుతాడు. ఈ రెండు వీడియోలను అనసూయ షేర్ చేసింది. మగాళ్లు భార్య విషయంలో ఒకలా, సోదరి విషయంలో మరోలా ఆలోచిస్తారా? అని ప్రశ్నించింది. నన్ను హైపోక్రైట్ అంటారా అంటూ కామెంట్ చేసింది. అనసూయకు, విజయ్ కు కోల్డ్ వార్ ఈ విషయంలో అనసూయ నేరుగా సందీప్ నే టార్గెట్ చేసింది. అర్జున్ రెడ్డి సినిమాపై కూడా అనసూయ తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. టీవీ డిబేట్లలో కూర్చొని మరీ ఆ సినిమాను తూర్పారబట్టింది. ఆ చిత్రానికి సంబంధించిన కంటెంట్, డైలాగ్స్ ను తీవ్రంగా తప్పుపట్టింది. అప్పటినుంచే అనసూయకు, విజయ్ దేవరకొండకు మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: