మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ టాలెంటెడ్ నటిమని కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈమె చాలా సంవత్సరాల క్రితం ఏక్ నిరంజన్ అనే తెలుగు మూవీ లో కూడా నటించి తెలుగు ప్రేక్షకులను కూడా బాగానే అదరించింది. ఇక ప్రస్తుతం మాత్రం ఈమె వరస హిందీ సినిమాలలో నటిస్తూ వస్తుంది. ఎక్కువ శాతం ఈమె ఈ మధ్య కాలంలో కమర్షియల్ సినిమాలలో కాకుండా లేడీ ఓరియంటెడ్ సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది.

ఇక కెరియర్ ప్రారంభంలో తన స్కిన్ షో తో కూడా ప్రేక్షకులను కట్టి పడేసిన ఈ బ్యూటీ ఈ మధ్య కాలంలో ఎక్కువ శాతం స్కిన్ షో లేని సినిమాల లోనే నటిస్తూ వస్తుంది. ఇది ఇలా ఉంటే ఈమె బీ జే పీ నుండి ఎంపీ గా పోటీ చేస్తున్న విషయం మనకు తెలిసిందే. దానితో ఈమె ఒక వేళ ఎంపీ గా గెలుపొందితే మళ్ళీ సినిమాల్లో నటిస్తుందా . ? లేదా అనే అనుమానాలు జనాల్లో రేకెత్తుతున్నాయి. తాజాగా ఈ బ్యూటీ తాను ఒక వేళ ఎంపీ అయితే సినిమాల్లో నటిస్తానా లేదా అనే దాని గురించి క్లారిటీ ఇచ్చింది.

తాజాగా ఈ బ్యూటీ మాట్లాడుతూ ... నేను బీ జే పీ నుండి ఎంపీ గా పోటీ చేస్తున్నాను. నేను ఒక వేళ ఎంపీ గా గెలిచినట్లు అయితే సినిమాల్లో నటిస్తాను. ఇప్పటికే కమిట్ అయిన సినిమాలు కొన్ని ఉన్నాయి. వాటిని అయితే ముందు పూర్తి చేస్తాను. వాటి తర్వాత కొత్త సినిమాల గురించి ఆలోచిస్తాను. అలాగే బాలీవుడ్ ను విడిచి పెట్టలేనని తాజా ఇంటర్వ్యూ లో ఈమె చెప్పుకొచ్చింది. ఇకపోతే ఈమె ప్రధాన పాత్రలో రూపొందిన సినిమాలలో కొన్ని సినిమాలు అద్భుతమైన విజయాలు అందుకున్నాయి. వాటి ద్వారా ఈమెకు మంచి గుర్తింపు కూడా లభించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Kr