ఐ కాన్ స్టార్ అల్లు అర్జున్ హీరో గా నేషనల్ క్రష్ రష్మిక మందన హీరోయిన్ గా సుకుమార్ దర్శకత్వంలో పుష్ప పార్ట్ 2 మూవీ చిత్రీకరణ ప్రస్తుతం జరుగుతుంది. మైత్రి సంస్థ వారు అత్యంత భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ మూవీ కి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తూ ఉండగా ... ఈ మూవీ లో ఫాహధ్ ఫజిల్ విలన్ పాత్రలో కనిపించనున్నాడు. అనసూయ , సునీల్ , రావు రమేష్మూవీ లో కీలక పాత్రలలో కనిపించనున్నారు. కొన్ని రోజుల క్రితమే అనసూయ పుట్టిన రోజు సందర్భంగా ఈ మూవీ మేకర్స్ ఆమెకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేయగా అది సూపర్ గా వైరల్ అయింది.

మూవీ ని ఆగస్టు 15 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ప్రస్తుతం ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన చిత్రీకరణను ఫుల్ స్పీడ్ గా పూర్తి చేస్తూ వస్తున్నారు. ఇకపోతే ఈ ఈ సినిమా బృందం వారు ప్రస్తుతం ప్రస్తుతం హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో వేసిన మలేషియా సెట్ లో ఈ చిత్రానికి సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇక ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో మలేషియా కు వెళ్లి ఈ సినిమా షూటింగ్ చేయడం కష్టం అవుతుంది అని ఉద్దేశంతో హైదరాబాదు లోని రామోజీ ఫిలిం సిటీ లోనే మలేషియా సెట్ ను వేసి మేకర్స్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తుంది. ఇకపోతే ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడటంతో ఈ మూవీ మేకర్స్ ఈ సినిమా నుండి కొన్ని రోజుల క్రితమే టీజర్ మరియు ఓ పాటను విడుదల చేశారు. ఈ రెండు కూడా ప్రేక్షకులను అత్యంత అద్భుతంగా ఆకట్టుకున్నాయి. వీటి ద్వారా ఈ సినిమాపై అంచనాలు మరింతగా పెరిగిపోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Aa