కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొంది 1996 లో విడుదల అయ్యి అద్భుతమైన విజయం సాధించిన ఇండియన్ మూవీ కి కొనసాగింపుగా ప్రస్తుతం శంకర్ , కమల్ హాసన్ హీరో గా ఇండియన్ 2 అనే మూవీ ని తెరకెక్కించాడు. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ , రకుల్ ప్రీత్ సింగ్ , సిద్ధార్థ్ కీలక పాత్రలలో కనిపించబోతున్నారు. అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ ని లైకా సంస్థ వారు నిర్మించారు. ఈ మూవీ మొత్తం మూడు భాగాలుగా విడుదల కానున్నట్లు తెలుస్తోంది. అందులో రెండవ భాగాన్ని మొదట జూన్ నెలలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

ఆ తర్వాత ఈ మూవీ నుంచి జూలై నెలలో విడుదల చేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి ఆ వార్తలకు తగినట్టు గానే ఈ మూవీన్ని జూలై 12 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇక ఈ సినిమాను తమిళ్ , తెలుగు , హిందీ భాషలలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ లోని మొదటి పాటను మే 22 వ తేదీన విడుదల చేయనున్నట్లు కూడా మేకర్స్ ప్రకటించారు.  ఇకపోతే ఈ మూవీ ఆడియో ఫంక్షన్ కు సంబంధించిన అనేక వార్తలు వైరల్ అవుతున్న విషయం మనకు తెలిసిందే. చెన్నై లో ఈ మూవీ ఆడియో ఫంక్షన్ భారీ ఎత్తున నిర్వహించబోతున్నట్లు తెలుస్తోంది.

మూవీ యొక్క ఆడియో ఫంక్షన్ ను జూన్ 1 వ తేదీన నిర్వహించేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు ఈ ఆడియో ఫంక్షన్ కి సూపర్ స్టార్ రజనీ కాంత్ ముఖ్య అతిథిగా రాబోతున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించిన పనులు అన్ని ఆల్మోస్ట్ కంప్లీట్ అయినట్లు దానితో ప్రచారాలను కూడా మరికొన్ని రోజుల్లోనే స్టార్ట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: