మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాకు ఆస్కార్ అవార్డు విజేత ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తూ ఉండగా ... యువి క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ , ప్రమోద్ లు ఈ మూవీ ని ఎంతో ప్రతిష్టాత్మకంగా , భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ మూవీ ని చాలా రోజుల క్రితమే వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 10 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ మూవీ విడుదల తేదీ ఇప్పటికే లాక్ అయ్యి ఉండడంతో ఈ సినిమాను కచ్చితంగా అదే తేదీన విడుదల చేయాలి అనే ఉద్దేశంలో ఈ మూవీ షూటింగ్ ను చాలా స్పీడ్ గా పూర్తి చేస్తూ వస్తున్నారు.

అలాగే చిరంజీవి కూడా ఈ సినిమా షూటింగ్ లో తప్ప వేరే ఏ మూవీ షూటింగ్ లో పాల్గొనకుండా ఈ మూవీ పైనే ఫుల్ కాన్సన్ట్రేషన్ పెట్టాడు. దానితో కూడా ఈ సినిమా షూటింగ్ చాలా స్పీడ్ గా పూర్తి అవుతూ వస్తుంది. ఇకపోతే కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ బృందం ఈ సినిమాకు అత్యంత కీలక సన్నివేశాలు అయినటువంటి ఇంటర్వెల్ సన్నివేశాలను చిత్రీకరించారు. ఇవి అద్భుతంగా వచ్చినట్లు తెలుస్తోంది. ఇక మరో భారీ షెడ్యూల్ మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ షెడ్యూల్ కోసం ఇప్పటికే రామోజీ ఫిలిం సిటీ లో భారీ సెట్ ను కూడా వేసినట్లు తెలుస్తోంది. ఇందులో ఓ యాక్షన్స్ ఎపిసోడ్ చిత్రీకరించబోతున్నారు. ఈ యాక్షన్ ఎపిసోడ్ చిరంజీవి  త్రిష పై స్టార్ట్ కాబోతున్నట్లు తెలుస్తోంది సమాచారం.  ఈ యాక్షన్ ఎపిసోడ్ షెడ్యూల్ జూన్ రెండవ వారం నుండి మొదలు కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ప్రస్తుతం ఈ మూవీ పై తెలుగు సినీ ప్రేమికులు భారీ అంచనాలు ఉన్నాయి. మరి ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకుంటుందో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: